తెలంగాణ

మద్యం సేవించి సభకు వచ్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: కాంగ్రెస్ సభ్యులు కొందరు సభకు మద్యం సేవించి వచ్చి గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్‌ను లక్ష్యంగా దాడికి తెగబడ్డారని టిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. మద్యం మత్తులో సరిగ్గా నిలబడలేక ఒక సభ్యుడు సిఎల్‌పి నేత జానారెడ్డిపై తూలిపడగా ఆయన సభ నుంచి బయటికి వెళ్లిపోయారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఉభయ సభల నుంచి ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం సందర్భంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, బొడకుంటి వెంకటేశ్వర్లు, వి గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చట్టసభల చరిత్రలోనే సోమవారం జరిగిన సంఘటన బ్లాక్‌డేగా టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం అభివర్ణించింది. కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా, చట్టసభల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వారు మండిపడ్డారు. సభలో దౌర్జన్యం చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు ముందుగానే చెప్పారని పల్లా రాజేశ్వర్‌రెడ్టి గుర్తు చేసారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.