తెలంగాణ

ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసిందని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్దాలను చెప్పించారని, ప్రసంగంలో ప్రాధాన్యత అంశాలను చేర్చకుండా,ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమైన నిరుద్యోగ సమస్యతో పాటు ముస్లిం, దళిత రిజర్వేషన్లపై గవర్నర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వ్యవసాయం విషయంలో అన్యాయంగా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్ర జరిగిన రైతు ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రాష్ట్రం వచ్చేనాటికి రూ.60వేల కోట్లు ఉన్న అప్పులకు తోడు అదనంగా లక్షా 40వేల కోట్లు అప్పులు చేశారని దుయ్యబట్టారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు 16లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇచ్చామని ప్రభుత్వమే ప్రకటించుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కావడం లేదని అన్నారు. వీటన్నింటిపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే 12 మంది సభ్యులున్న తమపై 50, 60 మంది పోలీసులను ఎగదొసి దాడి చేయించారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత నెలకొందన్నారు. గవర్నర్ సభకు ఆలస్యంగా రావడమే కాక అతి తక్కువ సమయంలో తన ప్రసంగాన్ని ముగించారని చిన్నారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుకునే హక్కును కూడా లేకుండా చేయడమే కాక కాంగ్రెస్ సభ్యులపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఉద్దేశపూర్వక దాడి కాదు: కోమటిరెడ్డి
చౌటుప్పల్: శాసనమండలి చైర్మన్ అంటే తనకు అపూర్వ అభిమానమని, ఉద్దేశపూర్వకంగా అతనిపై దాడి చేయలేదని శాసనసభాపక్ష ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అర్థరహితంగా ముగియడంతో కోపోద్రిక్తుడనయ్యానని చెప్పారు. అసెంబ్లీ చివరి సెషన్‌లో కూడా ప్రతిపక్షాలను కనీసం మాట్లాడనివ్వలేదన్నారు. పోలీసులతో అడ్డుకున్నారన్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ది మంచి స్వభావమనీ, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. అలాంటివారిపై దాడి చేయాలన్న ఉద్దేశం తనకులేదన్నారు. రెండు దశాబ్దాల కాలంలో ఇంత చెత్త బడ్జెట్ ఎప్పుడూ చూడలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.