తెలంగాణ

పెద్దల సభకు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు సోమవారం చివరి తేదీ కావడంతో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టిఆర్‌ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఖాళీ అయిన మూడు స్థానాలను గెలుచుకునేందుకు తగినంత మెజార్టీ అధికార టిఆర్‌ఎస్ పార్టీ కలిగి ఉండటంతో ఆ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు తమ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఆ పార్టీ అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేసారు. వీరితో పాటు జాజుల భాస్కర్ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడంతో మూడు రాజ్యసభ స్థానాలకు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార పక్షం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్ ముగ్గురు రెండేసి సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి బల్‌రామ్ నాయక్ కూడా రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలు చేసారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులు మొదట శాసనసభకు ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా చేరుకుని నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత వారు శాసనసభ కార్యదర్శి వేదాంతాచారి ఛాంబర్‌కు వెళ్లి ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేసారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపి కె కేశవరావు, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్‌రామ్ నాయక్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నాయకురాలు జె గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు.

చిత్రాలు..రాజ్యసభ అభ్యర్థులుగా సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్...
*కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి బల్‌రామ్ నాయక్