తెలంగాణ

ఆ ‘గాయం’ ప్రజాస్వామ్యానికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గవర్నర్‌ను లక్ష్యంగా చేసుకుని అరాచకం సృష్టించారని రాష్ట్ర నీటి పారుదల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడితో కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్‌కు గాయం కావడం కాదు ప్రజాస్వామ్యానికే గాయమైందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. మైక్‌లు, హెడ్ ఫోన్లు, పెన్నులు, కళ్ళజోళ్ళతో దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఉన్న 130 ఏళ్ళ చరిత్ర అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఉన్న అనుభవం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికేనా? అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసహనం కనిపిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. సభలో మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. చట్టాలు చేసే దేవాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా, గూండాల్లా ప్రవర్తిస్తూ కుస్తీకి దిగడం దారుణమని అన్నారు. ఇలాంటి హేయమైన చర్యలతో కాంగ్రెస్ సభ్యులు భావితరాలకు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరును కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అభినందిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాత్రం విషం కక్కుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సభలో సంయమనం పాటించి గౌరవాన్ని కాపాడిన తమ పార్టీది కుట్ర అని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

చిత్రం...ఉభయ సభల్లో ప్రసంగించేందుకు విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌కు స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు