తెలంగాణ

ఉపసంహరణ సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హుందాగా వ్యవహరించే ప్రతిపక్ష నేత కె జానారెడ్డిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం సబబుగా లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో పేర్కొన్నపుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు, కిషన్‌రెడ్డికి తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నపుడు జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, అలాంటి సంఘటనలకు చట్టసభల్లో స్థానం ఉండకూడదని అన్నారు. అయితే కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తీర్మానం రూపొందించే ముందు తమతో మాట్లాడితే బావుండేదని అన్నారు. పార్లమెంటు వ్యవస్థలో ఎవరూ ఆ రకంగా ప్రవర్తించకూడదన్నదే తమ అభిప్రాయమని అన్నారు. అయితే విపక్ష నేతలను సస్పెండ్ చేయడం సభకు శోభను తీసుకురాదని చెప్పారు. జానారెడ్డి లేచి ఎలాంటి నినాదాలు ఇవ్వలేదని, చర్య తీసుకునేలా వ్యవహరించలేదని అన్నారు. జరిగిన సంఘటనలపై ఆయన కూడా అందరి సమక్షంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారని అన్నారు. లోక్‌సభలో ప్లే కార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న వారు శాసనసభలో ప్లే కార్డులు పట్టుకోరాదని చెప్ప డం ఏమిటని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జోక్యం చేసుకుంటూ లోక్‌సభలో 500 మందికి పైగా సభ్యులుంటారని, టిఆర్‌ఎస్‌కు ఉన్న 10 మందో 12 మందో తమ వాదన వినిపించేందుకు పోడియం వద్దకు వెళ్లడం తప్పేమీ కాదని అన్నారు. అదే విధంగా విపక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తిస్తామని చెబితే ఊరుకోబోమని హెచ్చరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డిని తిరిగి సభలోకి ఆహ్వానించాలని కోరగా, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దానిని వెనక్కు తీసుకునేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిలదీశారు. మా దగ్గర రిపోర్టులు లేవా? ఉట్టిగానే సస్పెండ్ చేస్తామా? జానారెడ్డిపై తమకు గౌరవం లేదా? అని కిషన్‌రెడ్డిని ఉద్ధేశించి అన్నారు. నిన్న జరిగిన ఘటనను కిషన్‌రెడ్డి సమర్ధించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తామంతా వౌనం పాటించాలా అని నిలదీశారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు సిగ్గుచేటని అన్నారు. జానారెడ్డిని అందరికంటే తామే ఎక్కువగా గౌరవించేదని సిఎం స్పష్టం చేశారు. సిద్ధాంతాలు వీడి ఏకమవుతామంటే తాము చేసేదేమీ లేదని అన్నారు. సభలో మూడింట రెండొంతలు ఆమోదంతోనే సభ నిర్ణయం తీసుకుందని, సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి సభ్యుడు గౌరవించాలని అన్నారు. అటువైదపు ఉన్న ముగ్గురు సభ్యులు సభ నడిపిస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇటువైపు ఉన్న 90 మంది సభ్యులు మాట్లాడకుండా ఉండాలా అని సిఎం కేసీఆర్ అడిగారు. రాష్ట్రంలో అరాచక శక్తులను సహించే ప్రసక్తే లేదని అన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమని , నిన్నటి ఘటన కాంగ్రెస్ సభ్యుల అరాజకాలకు పరాకాష్ట అని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వంపై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని , తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. చీప్ పాలిటిక్స్‌కు కాంగ్రెస్ సభ్యులు పాల్పడుతున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించేది లేదని, రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పామని, ఎన్ని రోజులైనా సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయినా కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబుకాదని పేర్కొన్నారు. సభా హక్కులకు భంగం కలిగించొద్దని సిఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారని, తమకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోవాలని ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని తమ వద్ద సమాచారం ఉందని అన్నారు. రాజకీయాల్లో ఇంత అసహనం పనికిరాదని అన్నారు. శాసనసభను హుందాగా నడిపించుకోవల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని సిఎం చెప్పారు.
నిరసన హింసగా మారకూడదు: ఎంఐఎం
శాసనసభ నుండి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను సమర్ధిస్తున్నట్టు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. న్యాయబద్ధమైన చర్య అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరుస వోటమితో అసహన రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు దురదృష్టకరమని అన్నారు. గవర్నర్ మీద దాడి చేయాలనుకున్నాం కానీ మండలి చైర్మన్‌కు తగిలిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. నిన్న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలని అన్నారు. సభలో వివాదం జరుగుతున్నపుడు ఆ నిరసనకు పాల్పడుతున్న సభ్యులు వీడియోను రికార్డు చేసి ఉంచుకోవాలని, అవసరం వచ్చినపుడు దానిని ప్రజలకు విడుదల చేయాలని చెప్పారు. నిరసన ప్రజాస్వామ్యమార్గమే అయినా, నిరసన హింసగా మారకూడదని పేర్కొన్నారు.