తెలంగాణ

ప్రజల వద్దకు భారతీయ వైద్యం నిధుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12 : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ వైద్యానికి ప్రాచుర్యం కల్పించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని ఆయుష్ (ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్యం) కమిషనర్ డాక్టర్ ఎ. రాజేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ‘పబ్లిక్ ఔట్ రీచ్ ఆక్టివిటీ’ పేరుతో మరో నెలరోజుల్లో భారతీయ వైద్యంపై విస్తృతంగా ప్రచారం చేయబోతున్నామన్నారు. ఇళ్లల్లో ఔషధమొక్కల పెంపకం, ఉపయోగాలు, చిన్ని చిన్న చిట్కాలు తదితర అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమన్నారు. 15 వేలలోపు జనాభా కలిగిన మూడు నాలుగు గ్రామాలను కలిపి (క్లస్టర్ ఆఫ్ విలేజెస్) తొలుత ప్రచారం చేస్తామని వివరించారు. తొలిదశలో కొన్ని యూనిట్లను ఎంపిక చేస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఈ ప్రచారాన్ని విస్తరిస్తామని వివరించారు. భారతీయ వైద్య విధానం వైద్యులకు ఇందుకు అనుగుణంగా శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులను ఇస్తామన్నారు. జిల్లా స్థాయి అల్లోపతి ఆసుపత్రుల్లో ఆయుష్ విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. భారతీయ వైద్య ఆసుపత్రుల సేవలు గ్రామీణులకు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు.
అనంతగిరిలో ఆదర్శ ఆసుపత్రి
రంగారెడ్డి జిల్లా అనంతగిరిలో ’మోడల్’ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని రాజేందర్‌రెడ్డి తెలిపారు. బెంగుళూరులోని ‘జిందాల్’ తరహాలో దీన్ని అభివృద్ధిచేస్తామని వివరించారు. ప్రస్తుత సంవత్సరం ఆయుష్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 13.12 కోట్లు కేటాయించిందని, గతంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు లభించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్ నేతృత్వంలో ఐదు మెడికల్ కాలేజీలు (రెండు ఆయుర్వేద, ఒక హోమియో, ఒక యునాని, ఒక నేచురోపతి) ఉన్నాయని రాజేందర్‌రెడ్డి తెలిపారు.