తెలంగాణ

ఆ ఇద్దరూ ఇక మాజీలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: రాజ్యాంగ పరిరక్షకుడినే లక్ష్యంగా చేసుకొని దాడి చేసామన్న వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పేమి లేదని శాసనసభ వ్యివహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్‌పై దాడికి దిగి, మరో అత్యున్నత పదవిలో ఉన్న శాసనమండలి చైర్మన్‌పై దాడి చేస్తే చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటామని మంత్రి ప్రశ్నించారు. శాసనసభ లాబీల్లో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలి లాబీల్లో మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్-చాట్‌గా మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సభలో కరణం బలరామ్‌పై చర్య తీసుకున్న విషయాన్ని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసారు.
పక్క రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్మెల్యే రోజాపైనా ఇదే తరహా చర్యలు తీసుకున్నారని అన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు ఎక్కడో కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇదే సభలో ఉన్నాయని మంత్రి గుర్తు చేసారు. సభ్యత్వం రద్దు అయిన వాళ్లు ఇక నుంచి మాజీలేనని హరీశ్‌రావు స్పష్టం చేసారు.
ప్రోత్సహించిన వారూ శిక్షార్హులే: కేటీఆర్
నేరానికి పాల్పడిన వారే కాదు వారిని ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులేనని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్-చాట్ చేస్తూ గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కమార్‌ను ప్రోత్సహించడం, సహకరించడం వల్లనే ఆ పార్టీకి చెందిన మిగతా సభ్యలపై స్పీకర్ చర్య తీసుకున్నారన్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చట్టసభలో అనుచితంగా ప్రవరించిన వారిపై ఇలాంటి చర్యలే తీసుకున్నారని కెటిఆర్ గుర్తు చేసారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై సభలో చేసే తీర్మానం ప్రకారం చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేసారు.