తెలంగాణ

బీసీ బడ్జెట్‌ను రూ.10వేల కోట్లకు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ప్రస్తుతం ఐదు వేల కోట్లుగా ఉన్న బీసీ బడ్జెట్‌ను రూ.10వేల కోట్లకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఇటీవల బీసీ డిక్లరేషన్ సందర్భంగా అంగీకరించిన డిమాండ్లకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలని కోరారు. అదేవిధంగా రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించి దానిలో అన్ని ప్రభుత్వ పథకాలను అనుసంధానించి జనాభా ప్రకారం కేటాయించాలని విన్నవించారు. ప్రతీ సంవత్సరం బీసీ, ఎంబీసీ కార్పోరేషన్లకు రూ.2వేల కోట్లను కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో బీసీ కులవృత్తుల ఫెడరేషన్లు దాదాపు 14 ఉన్నాయని, వాటికి జనాభా నిష్పత్తి ప్రకారం వెయ్యి కోట్ల నుంచి 100 కోట్ల వరకు కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.