తెలంగాణ

ఆర్టీసీని అన్ని విధాలా ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పురాణం సతీష్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఆర్టీసీ నష్టాలు, అందుకు గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానంగా ఇచ్చారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నమాట వాస్తవమేనని, ఉద్యోగుల వేతనాలు 44శాతం పెరుగుదల, 4001 మంది కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ, వేతన స్కేళ్ల సరవణపై బకాయిల చెల్లింపు, ఇంధన కొనుగోళ్లు, వడ్డీలు తదితర వాటి వల్ల సంస్థ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వివరించారు. అయితే సంస్థపై పెరిగిన భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రూ. 428.08 కోట్లను ఇచ్చిందని చెప్పారు. గ్రేటర్‌లోని డిపోల్లో నష్టాలను పూడ్చేందుకు జీహెచ్ ఎంసీ నుంచి రూ. 336.40 కోట్లను, నిర్వహణ, పెట్టుబడి కొరతను తీర్చేందుకు రూ.500 కోట్లను విడుదల చేసిందని చెప్పారు. బస్‌పాస్ రాయితీల రీయంబర్స్‌మెంట్ నిమత్తం ప్రభుత్వం రూ.520కోట్లను గత బడ్జెట్‌లో కేటాయించి రూ.230 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. గత సంవత్సరం బస్సుల కొనుగోలుకు రూ.70 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి సంస్థను కాపాడుతామని హామీ ఇచ్చారు.