తెలంగాణ

కాంగ్రెస్, టిడిపి బంధానికి తొలి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: కాంగ్రెస్, తెలుగు పార్టీల అనుబంధానికి పాలేరు ఉప ఎన్నిక ఒక పరీక్షా నిలువనుంది. రెండు పార్టీలు కలిసి ఉధృతంగా ప్రచారం సాగిస్తున్న ఈ ఎన్నికల్లో స్నేహం గట్టి ప్రభావాన్ని చూపిస్తే భవిష్యత్తులోనూ రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఇక్కడ కూడా అలానే ఫలితాలు వస్తే రెండు పార్టీల మధ్య స్నేహం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిలు పాలేరు ఉప ఎన్నికల్లో కలిసి ప్రచారం సాగిస్తున్నారు. రాజకీయాల్లో బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టిడిపిలు కలిసి పని చేయడం, ఒకే వాహనంలో రెండు పార్టీలు నాయకులు భుజం భుజం కలిపి ప్రచారం చేయడం మీడియాకు సైతం విడ్డూరంగా ఉంది. రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోవడానికి తొలుత కొంత ఇబ్బంది పడ్డా వెంటనే సర్దుకున్నారు. అయతే, సాధారణ ఎన్నికల నాటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మార్పు లేకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడక అన్నట్టుగా ఉండేది. కానీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఖమ్మం జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
శాసన మండలి ఎన్నికల్లో , గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలు తెరచాటుగా కలిసి పనిచేసినా రెండు పార్టీలు బహిరంగంగా కలిసి ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. టిడిపి, కాంగ్రెస్ ఉమ్మడి జెండాలతో పాలేరులో నాయకులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. విజయంపై టిఆర్‌ఎస్ ధీమాగా ఉన్నా, పార్టీలన్నీ ఏకమైనందున మెజారిటీ తగ్గవచ్చని నాయకులు అంచనా వేస్తున్నారు.
టిడిపి, కాంగ్రెస్ కలిసి ప్రచారం చేస్తున్న అంశాన్ని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా పేర్కొంటోంది. పాలేరు ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్, టిడిపి భవిష్యత్తు బంధం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం రెండు పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్లు భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డిల ఉమ్మడి ప్రచారం