తెలంగాణ

టీఎస్ ఐపాస్ వల్ల పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌పాస్ పారిశ్రామిక విధానం హిట్టయింది. వినూత్న విధానం వల్ల ఈ స్కీం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు 3551 పరిశ్రమలను స్థాపించారు. రూ.32,558 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
1.56 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కాగా ఈ స్కీంకోసం ఇంతవరకు మొత్తం 6117 పరిశ్రమలకు, రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రతిపాదనలు వచ్చాయి. 4.43 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీలు వచ్చాయి. రాష్ట్రంలో సూక్ష్మ, మధ్య, తరహా పరిశ్రమల నమోదు క్రమంగాపెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచి తయారీ రంగంలో రూ.7130 కోట్ల పెట్టుబడులతో 13,671 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభమయ్యా యి. వీటి ద్వారా 1.45 లక్షల మందికి ఉపాధి అవకాశా లు ఏర్పడ్డాయి. ఫార్మా సూటికల్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా 2016-17లో ఎక్కువ ఆదాయం వచ్చింది. 2016-17లో ఉత్పత్తుల ఎగుమతుల్లో 44 శాతం ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. వీటి విలువ రూ.17,744 కోట్లు. ఐటి, ఐటి ఆధారిత సేవా సంస్తల వల్ల గత రెండేళ్లలో ఎగుమతుల విలు వ రూ. 85,470 కోట్లకు చేరుకుంది. 2014- 15లో1200 మంది ఐటి పరిశ్రమలు ఉంటడగా, 2016- 17లో 1500 కు పెరిగాయి. ఈ రంగం లో ఉద్యోగాల కల్పన 2014-15లో 3.71 లక్షలు ఉండగా, 2016-17కు 4.31 లక్షలకు పెరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 2016, 2017 సంవత్సరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 98.78 శాతం స్కోరు ఈ విభాగంలో సాధించింది.
రాష్ట్రంలో సంస్కరణల అమలు వేగవంతమైందని సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ పేర్కొంది. టిఎస్‌ఐపాస్‌లో 23 శాఖలకు పరిశ్రమల అనుమతికి సంబంధించి 30 క్లియరెన్సులు ఇచ్చే బాధ్యతను అప్పగించారు. దీని వల్ల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ప్రతి అనుమతికి నిర్ణీత కాలపరిమితిని నిర్దేశించారు.