తెలంగాణ

కోటి ఎకరాల సాగుకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: ప్రతీ ఏటా నిధుల కేటాయింపులో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసే పరంపరను ఈ సారి బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం కొనసాగించింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారానే బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించిన రూ. 25 వేల కోట్ల నిధులు ప్రతిబింభించాయి. గోదావరి, కృష్ణ నదులపై 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే.
ఒకవైపు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, మరో వైపు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిని ఏకకాలంలో పూర్తి చేసే లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగింది.
సాగునీటి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు బడ్జెట్ కేటాయింపులు అద్దం పట్టాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్నతరహా ప్రాజెక్టులకు 2015-16 బడ్జెట్‌లో రూ.10,933 కోట్లు కేటాయించగా, 2016-17 బడ్జెట్‌లో వీటికి రూ.15,723 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో వీటికి ఉహించని విధంగా రూ. 25 వేల కోట్లకు పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 25 వేల కోట్లలో రూ. 20,040 కోట్లు ఖర్చు చేయడం రికార్డుగా నిలువనుంది. ప్రాజెక్టులపై ఇంత పెద్దమొత్తంలో నిధుల కేటాయింపు కానీ, వ్యయం కానీ మునుపెన్నడూ జరుగలేదంటే ప్రభుత్వం ఈ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా ఈ ఏడాది వర్షాకాలం నాటికి మరో 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురాబోతున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరో రెండేళ్లలో పూర్తి చేసి 36.75 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే లక్ష్యానికి అనుగుణంగా నిధుల కేటాయింపు జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా మరో మూడు జలాశయాల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. పెనుగంగ ప్రాజెక్టు పరిధిలో ఈ మూడింటిని నిర్మించనున్నారు. గతనెల ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఆదిలాబాద్ పర్యటనలో ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్, హరీశ్‌రావు (ఫైల్ ఫొటో)