తెలంగాణ

ప్రతి ఇంటికీ శుద్ధి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ శుద్ధి జలాలు అందిస్తామని, రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య రక్షణ అందిస్తామని పేర్కొన్నారు. కొత్తగా సూర్యాపేట, నల్గొండలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించామని, కోకాపేటలో ఇస్లామిక్ కనె్వన్షన్ సెంటర్ నిర్మిస్తామని, ప్రతి సామాజిక వర్గానికీ రాజధానిలో స్థలం కేటాయించి, మంచి భవనాలు నిర్మిస్తామని, వరంగల్‌లో ఐటి సెజ్ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ హైవేలు, స్కైవేలు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మరో 27 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా గోదావరి నదీ జలాల నుండి శుద్ధి చేసిన 59.94 టిఎంసిల నీటిని అందిస్తామని అన్నారు. 26 సెగ్మెంట్లుగా ఈ ప్రాజెక్టును విభజించామని, 67 ఇన్‌టేక్ వెల్స్,. 153 శుద్ధి చేసే ప్లాంట్లు, 1,69,705 కిలోమీటర్లు పొడవైన పైప్‌లైన్లతో ఈ కార్యక్రమం చేపట్టామని, 35,514 ఓహెచ్‌ఆర్‌ల ద్వారా పల్లెకు, పట్టణానికి , ప్రతి ఇంటికీ నీరు చేరుతోందని వెల్లడించారు. ఈ భగీరథ మిషన్ ఫలితాలు ఇప్పటికే 5752 గ్రామీణ ఆవాసాలకు , 15 పట్టణాలకు, 2900 గ్రామాలలో ఇంటింటికీ చేరాయని చెప్పారు. దేశ చరిత్రలో నిలిచే ఈ కార్యసాధన ఫలితం కళ్ల ముందు కనిపిస్తోందని అన్నారు.
రికార్డు సమయంలోనే భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశామని, దీంతో పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలమైందని ఆర్ధిక మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్ది నెలల్లో వాటర్ పంపింగ్ పాక్షికంగా ప్రారంభమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కనె్వన్షన్ హాలును కోకాపేటలోని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తామని అన్నారు. రెడ్టి హాస్టల్ కోసం బుద్వేల్‌లోని 15 ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి 10 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రతి సామాజిక వర్గం కోసం హైదరాబాద్ నగరంలో స్థలం కేటాయించి భవనం నిర్మించాలని విధాన నిర్ణయం తీసుకున్నామని, ఈ భవనాలు ఆయా సామాజిక వర్గాల వికాస కేంద్రాలుగా ఉపయోగపడాలని ప్రభుత్వం ఆశిస్తోందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి 75 కోట్లు ఇస్తున్నట్టు ఆర్ధిక మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేశామని, 9522 ఇళ్లు పూర్తయ్యాయని, 1,68,981 ఇళ్లు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ప్రజలు అందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యను మరింత అభివృద్ధి చేయడానికి కొత్తగా వైద్య కళాశాలలు నెలకోల్పుతున్నామని, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నిజామాబాద్‌లలో ఇప్పటికే వైద్య కళాశాలలు మంజూరు చేశామని, కొత్తగా సూర్యాపేట, నల్గొండలలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 24,950 కిలోమీటర్లు ఆర్ అండ్ బి, 69,500 కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని, ఒకపుడు 31 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికాగా, నేడు 3283 మెగావాట్లకు చేరుకుందని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేస్తామని, రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఎకో ఫార్మాసిటీ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మహిళల ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఏర్పాటు చేసిన వి హబ్ ప్రారంభ పెట్టుబడిగా 15 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. వరంగల్‌లో ఐటి సెజ్ ఏర్పాటుకు 45 ఎకరాల స్థలంలో భవనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో రహదారుల వ్యవస్థను మెరుగుపరిచేందుకు హైదరాబాద్‌లో నాలుగు దిక్కుల ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు, ఆకాశవీధులు (స్కైవేలు) నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.