తెలంగాణ

బడ్జెట్‌పై విపక్షాల పెదవి విరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బీజేపీ, టీపీపీ, సీపీఎం పార్టీల సభ్యులు పెదవి విరిచారు. రూ.1,74,553 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం బాజా మోగిస్తున్నా వాస్తవ రూపంలో ఆ మేరకు ఖర్చులు కావడం లేదని మండిపడ్డాయి. మొత్తం బడ్జెట్ వాస్తవ విరుద్దంగా ఉందని బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చెప్పేది బారెడ్ చేసేది మాత్రం జానడేనని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా తిరిగి అదే తరహాలో మోసం చేసే విధంగా కేటాయింపులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రారంభించిన వెల్‌నెస్ సెంటర్లను సైతం ఎత్తివేసిందని, హరితహారానికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో గులాభి రంగులో చూపిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్‌టి, నోట్ల రద్దు ద్వారా రాష్ట్రానికి మేలే జరిగిందని, ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు అయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పెట్రోల్, డిజిల్‌ను సైతం జీఎస్‌టి పరిధిలోనికి తీసుకువచ్చి ప్రజలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
బీసీల పట్ల చిన్నచూపు, వివక్ష
ప్రదర్శించారు : ఆర్.కృష్ణయ్య
బడ్జెట్‌లో ప్రభుత్వం బీసీల పట్ల చిన్నచూపు, తీవ్ర వివక్ష ప్రదర్శించిందని ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్పగా ప్రచారం చేసుకుంటున్న బడ్జెట్ ఏ వర్గాలను సంతృప్తి ఇచ్చేవిధంగా లేదని, మాయ మాటలు, అంకెల గారెడీ చేశారని అన్నారు. బీసీ కార్పోరేషన్‌కు రూ.10 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు రూ. 20 కోట్లు కేటాయించాలని కోరినా పెడచెవిన పెట్టారని అన్నారు. వ్యవసాయం, పరిశ్రలకు భారీ కేటాయింపులు అని చెబుతున్నా, వాస్తవంగా ఆ స్థాయిలో ఖర్చు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్ పరిశ్రమలకు పెద్ద పీఠ వేస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ రంగం ఒక్క పరిశ్రమను కూడా స్థాపించలేదని అన్నారు. ఇది బడుగు, బలహీన వర్గాల వ్యితిరేక బడ్జెట్ అని, వెంటనే బడ్జెట్‌ను రివైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
పుస్తకం బరువు మాత్రమే ఎక్కువ :
సండ్ర వెంకటవీరయ్య
బడ్జెట్ పుస్తకం బరువుమాత్రమే ఎక్కువ అని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని ప్రచారం చేసుకున్న డబుల్ బెడ్‌రూమ్‌లకు 2600 కోట్లు ఎలా సరిపెడతారని ప్రశ్నించారు. వివిధ వర్గాలను విస్మరించేలా ఈ బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. రైతుల మద్దతు ధర, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం వంటివి ఏవి ఇందులో లేవని అన్నారు. భారీ కేటాయింపులు చూపిస్తూ ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ఆకాశంలో కేటాయింపులు ఖర్చు శూన్యం :
సున్నం రాజయ్య
బడ్జెట్ కేటాయింపులను ఆకాశంలో చూపిస్తున్న ప్రభుత్వం ఖర్చ చేయడంలో వెనుకంజ వేస్తుందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధరలేక కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. అలాంటి వారికి సహాయం అందించకుండా ఎకరానికి నాలుగువేలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసులపై తీవ్ర నిర్భందాలను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోసపూరిత బడ్జెట్ అని విమర్శించారు.
ఇది పేదల బడ్జెట్ :
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధిని కాక్షిస్తూ కేటాయింపులు జరిపారని అన్నారు.
శరవేగంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేసి లక్షలాది ఏకరాలకు నీరు అందించేందుకు రూ.25వేల కోట్లు కేటాయించారని అన్నారు. బడ్జెట్ అద్వితీయమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,74,453కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వం త్రికరణ శుద్దితో బడ్జెట్ కేటాయింపులు జరిపిందని, వ్యవసాయ, పారిశ్రామి, సంక్షేమ రంగాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించారని అన్నారు.
బీసీలను నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్ :
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
రాష్ట్ర బడ్జెట్ బీసీలను తీవ్ర నిరాశపరిచిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోగా ప్రభుత్వం సబ్‌ప్లాన్ ఊసే ఎత్తలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. వచ్చే బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చేసిన హామీని మరిచారని, అదే విధంగా బీసీ కార్పోరేషన్‌కు ఒక్కరూపాయి కేటాయించలేదని పేర్కొన్నారు. వీటితో పాటు 13 ఫెడరేషన్ల ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. గతంతో పోల్చితే కేటాయింపులు పెరిగినా జనాబా దమాశా ప్రకారం బీసీలకు న్యాయం చేయలేక పోయారని తెలిపారు.
ప్రజావ్యతిరేక బడ్జెట్ :
డాక్టర్ కె లక్ష్మణ్
తెలంగాణ బడ్జెట్ మొత్తం అబద్దాల పుట్ట అని, ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో ఎలాంటి జీవం లేదని, సారం లేదని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలకు కేటాయింపులకు అసలు పొంతన లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీల సంక్షేమానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ అసలు ఈ నాలుగేళ్లలో ఖర్చు చేసింది ఎంత అని నిలదీశారు. మూత పడ్డ పరిశ్రమల ఊసే లేదని, నిజాం సుగర్స్, వరంగల్ రేయాన్ ప్రస్తావన లేదని అన్నారు. రుణ మాఫీ వడ్డీ బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని ఆరోపించారు.
బడ్జెట్‌లో మద్దతు ధర ప్రస్తావన లేదని, ఒక్క రూపాయి ఖర్చు చేయని దానికి ఎంబిసిలకు వెయ్యి కోట్లు అని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పిఎం ముద్రా యోజన కింద 9వేల కోట్లు పేదలకు వెచ్చించారని , ఈ పథకం కింద 69 శాతం మహిళలు, 70 శాతం ఎస్సీలు లబ్ది పొందారని అన్నారు. అరెస్టులు, అణచివేతలకు తాము భయపడేది లేదని లక్ష్మణ్ హెచ్చరించారు.