తెలంగాణ

ఆరోగ్యశ్రీకి అప్పగిస్తే ఆందోళన: టీయూడబ్ల్యూజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, మార్చి 15: జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువస్తే రాష్టవ్య్రాప్తంగా ఆందోళన తప్పదని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) సలహాదారుడు కే.శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు నంగనూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాత్ అలీ గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం నిరుత్సాహానికి గురి చేస్తోందని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించటంలో వైఫల్యం చెందుతున్న ఆరోగ్యశ్రీ పరిధిలోకి జర్నలిస్టుల హెల్త్ స్కీం చేర్చవద్దని కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రవేశపెట్టిన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు 1700 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు లభించాయని, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం రూ.6.65కోట్లు మాత్రమేనని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని వివరించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని కోరారు.