తెలంగాణ

అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మార్చి 15: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి బాటన పయనిస్తూ అభివృద్ధికి చిరునామాగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో రూ.కోటి 95 లక్షల నిధులతో నిర్మించిన అయిదు కమ్యూనిటీ హాళ్ళు, రెండు చిన్నారుల పార్కులను మంత్రి ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో పట్టణంను పరిశుభ్రంగా ఉంచేందుకు కొనుగోలు చేసిన ‘ఊడ్చే యంత్రం’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలో సుమారు నాలుగేళ్ళలో అపూర్వ ప్రగతి సాధించి దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. అభివృద్ధి పరంపర మరింత వేగంగా కొనసాగించేందుకు గురువారం శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపకరించనుందన్నారు. పట్టణాలలో వౌలిక వసతుల కల్పన, పౌరసదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మరో వైపు పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్‌ను అభివృద్ధి పరిచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కార్గిల్ లేక్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనం పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.