తెలంగాణ

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసి, వివిధ ప్లాంట్లను నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ 7778 మెగావాట్లు ఉండగా, 2017 డిసెంబర్ నాటికి 14913 మెగావాట్లకు చేరుకుంది. కాగా 13,183 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోంది. రానున్న రోజుల్లో కొత్త గూడెం థర్మల్ ప్రాజెక్టు ఏడవ దశ 800 మెగావాట్లు, భద్రాద్రి కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టు 1080 మెగావాట్లు, యాదాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ కింద 4వేల మెగావాట్ల విద్యుత్ కలిపి మొత్తం 5800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2882.50 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 2411.76 మెగావాట్ల జల విద్యుత్, సౌర విద్యుత్ ఒక మెగావాట్లు కలిపి జెన్కో పరిధిలో 5295.26 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ రంగంలో గృహ విద్యుత్ సర్వీసులు 99 23,293, గృహేతర రంగంలో 12,38,895 సర్వీసులు, పారిశ్రామిక రంగంలో 92708 సర్వీసులు, కుటీర పరిశ్రమల్లో 17,258 సర్వీసులు, వ్యవసాయ రంగంలో 22,64,065 సర్వీసులు, పబ్లిక్ లైటింగ్‌లో 1,20,720 సర్వీసులు, జనరల్ కేటగిరీలో 53,986 సర్వీసవులు తాత్కాలిక కేటగిరీలవో 819, హెట్‌టి విభాగంలో 111087 సర్వీసులు కలిపి 137,22,831 సర్వీసులు విద్యుత్ రంగంలో ఉన్నాయి. విద్యుత్ రంగంలో 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. సౌర విద్యుత్‌ను 3090 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. అందరికీ విద్యుత్‌స్కీం అమలుకు రాష్ట్రప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు సామాజిక, ఆర్థిక అవుట్‌లుక్‌లో పేర్కొన్నారు.