తెలంగాణ

దగాకోర్ బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దగాకోర్ బడ్జెట్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గురువారం గాంధీభవన్‌లో సీఎల్‌పీ లీడర్ చిన్నారెడ్డితో కలిసి మాట్లాడారు. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపిస్తూ ఖర్చు చేయడంలో వెనుకంజ వేయడం కేసీ ఆర్ ప్రభుత్వానికి అనవాయితీగా మారిందని విమర్శించారు. ఈ ఏడు రూ.1,74,453 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా అందులో 40శాతం కూడా ఖర్చు చేయరని ఆరోపించారు. వారికి భారీగా కమీషన్లు వచ్చే వాటికి నిధులను విడుదల చేస్తూ మిగిలిన వాటిని పక్కనపెడుతున్నారని అన్నారు. కేటాయింపులకు నిధుల విడుదలకు తీవ్ర వ్యత్యాసం ఉంటుందని, ఒక శాఖకు చెందిన నిధులను ముఖ్యమంత్రి తనకు నచ్చిన శాఖకు మళ్లిస్తున్నా అధికారులు అడ్డుచెప్పడం లేదని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ గిన్నీస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంటారని ఎద్దేవా చేశారు.
ఇష్టానుసారంగా బ్యాంకుల నుంచి తీసుకువస్తున్న రుణాలను భవిష్యత్‌లో వివిధ పన్నుల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 30-40శాతం కూడా ఖర్చు చేస్తారని నమ్మకం లేదన్నారు. ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతూ 40శాతానికి మించి ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతిష్టాత్మక డబుల్ బెడ్‌రూమ్ గృహాలకు రూ.2,643 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో మిగిలిన గృహాలను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకంలో 34లక్షల మందిని లబ్దిదారులగా గుర్తించి ఇప్పటి వరకు కేవలం 4,939 మందికి మాత్రమే ఇచ్చారని అన్నారు. లక్షా పదివేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీ ఆర్ కేవలం 27,588 ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్‌ను సైతం తగ్గించారని విమర్శించారు. ప్రజలను మోసం చేసే విధంగా రూపొందించిన బడ్జెట్ అని, కేసీఆర్ మోసపూరిత కేటాయింపులు, హామీలపై ప్రజలను చైతన్య పరిచి వారిచేతే బుద్దిచెప్పిస్తామని తెలిపారు.