తెలంగాణ

టెన్త్ పరీక్షల్లో ఓ ఇన్విజిలేటర్‌పై చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: పదో తరగతి పరీక్షలు గురువారం తెలంగాణలో ప్రశాంతంగా మొదలయ్యాయి. అయితే పలు చోట్ల విద్యార్థులు హాల్‌టిక్కెట్ల కోసం నానా అగచాట్లు పడ్డారు. సరూర్‌నగర్‌లో అనుమతి లేని న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు మరో స్కూల్ నుండి పరీక్షలకు ఎన్‌రోల్ చేశారు. తీరా ఆ హాల్ టిక్కెట్లు తీసుకువెళ్లిన విద్యార్థులకు ఆ పాఠశాలకు అనుమతి లేదని అధికారులు వెనక్కు పంపించగా వారు లబోదిబోమన్నారు. న్యూ మారుతి నగర్‌లోని శ్రీ ద్వారాకామయి స్కూలు నుండి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. దాంతో తల్లిదండ్రులు న్యూ రెయిన్‌బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వద్దకు చేరుకుని ధర్నా చేశారు. పరీక్షలకు అనుమతించకుంటే తమ చదువు వ్యర్ధం అవుతుందని ఉదయ్ కుమార్, అశ్విన్ కుమార్ అనే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 985 పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లిలో ఒకరికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించి పట్టుకున్నారు. అలా ఇద్దరు దొరికారు. వరంగల్ జిల్లాలో ఒకరు కాపీ కొడుతూ దొరికిదపోవడంతో ఇన్విజిలేటర్‌ను రిలీవ్ చేసినట్టు పరీక్షల డైరెక్టర్ బి సుధాకర్ తెలిపారు.