తెలంగాణ

పవన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కళ్యాణ్ తెలంగాణ నుంచి కబ్జాల కల్చర్‌ను ఏపీకి తీసుకువచ్చారని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు డిమాండ్ చేసింది. బుధవారం గుంటూరు సభలో పవన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ వచ్చిన వారే ఇక్కడి పార్కులు, చెరువులు, అడవులను, ఊళ్లను అన్నింటిని ఆక్రమించుకున్నారని, వారిని వదలి తెలంగాణ సంస్కృతి అనడం అంటూ విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే కబ్జాలకు వ్యతిరేకంగా అన్న విషయాన్ని పవన్ గుర్తించాలని అన్నారు. తెలంగాణ పౌరులను, ఉద్యమాన్ని అవమానిస్తూ పవన్ మాట్లాడారని అన్నారు.