తెలంగాణ

పంచాయతీరాజ్‌కు రూ. 15563 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 2018-19 బడ్జెట్‌లో 15,563 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 69,500 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రస్తుత సమావేశాల్లో తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, పురపాలకసంస్థలకు అందించాల్సిన నిధులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌ను రాజేశంగౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. గ్రామపంచాయతీల పరిపుష్టికి 1500 కోట్ల రూపాయలు, పురపాలక సంస్థల పటిష్టత కోసం 1000 కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించారు. రోడ్లు భవనాల శాఖకు బడ్జెట్‌లో 5575 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆర్ అండ్ బి పరిధిలోని 24,950 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు మధ్య రోడ్లను డబల్ లేన్ రోడ్లుగా మారుస్తున్నారు. అర్ అండ్ బి పరిధిలో 511 వంతెనలను కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు.
మిషన్ భగీరథకు రూ. 1801 కోట్లు
మిషన్ భగీరథ పథకానికి బడ్జెట్‌లో 1801 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రభుత్వ ఖజానా నుండి నిధులు కేటాయిండంతో పాటు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఈ పథకం కింద తాగునీటిని అందించాలని సంకల్పించారు. కృష్ణా, గోదావరి నదుల నుండి 59.94 టీఎంసీల నీటిని ఈ పథకం కోసం వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 1,69,705 కిలోమీటర్ల పైప్‌లైన్లను వేస్తున్నారు. భగీరథ పథకం ఇప్పటికే 5752 గ్రామీణ ఆవాసాలకు, 15 పట్టణాలకు తాగునీరు లభిస్తోంది. ఈ పథకం పూర్తి చేసేందుకు సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
హోంశాఖకు రూ. 5,790 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో గురువారం సమర్పించిన వార్షిక బడ్జెట్‌లో హోంశాఖకు రూ.5,970 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనల్లో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. అనేక దశాబ్ధాలుగా నిత్యం అలజడి, అశాంతులతో తెలంగాణ సమాజం అట్టుడికింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంత జీవనం కొనసాగుతున్న పరిస్థితుల్లో శాంతిభద్రతల వ్యవస్థను మరింత ప్రతిభావంతంగా పని చేసేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించినట్లు పేర్కొంది. పరిపాలనా సౌలభ్యం కోసం పెంచిన కొత్త జిల్లాల్లో పోలీస్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలకు గత బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 13 చోట్ల పోలీసు కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నట్లు పేర్కొంది. కాగా అనేక సంస్కరణలు అమలు చేసి పోలీసు శాఖను మూడేళ్లలో ఎంతో ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. పోలీస్ సేవలను ప్రజల ముంగిటకు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో ఏడు కొత్త పోలీసు కమిషనరేట్లు, 27 కొత్త పోలీసు సబ్‌డివిజన్లు, 29 సర్కిళ్లను, 103 పోలీస్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రభుత్వం సభ దృష్టికి తెచ్చింది. హోంగార్డుల వేతనం రూ.9 వేల నుంచి రూ.20 వేలకు పెంచడం ద్వారా వారి జీవన స్ధితిగతుల్లో అద్భుతమైన మార్పును తీసుకురాగలిగామని, అలాగే వారి సంక్షేమానికి కూడా పోలీసులకు అందిస్తున్న సౌకర్యాలను అందించడం జరుగుతోందని స్పష్టం చేసింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు పదోన్నతి కల్పించిన సంగతి వెల్లడించింది.