తెలంగాణ

ఆలయాలకు రూ. 622 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: దేవాలయాల అభివృద్ధి, అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల కోసం 2018-19 బడ్జెట్‌లో 622 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆలయాలకు సంబంధించి బడ్జెట్‌లో పెద్దపీఠ వేశారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, యాదాద్రి దేవాయల పనులను ఈ సంవత్సరం పూర్తి చేయాలన్న లక్ష్యం తో యాదగిరిగుట్ట దేవాలయ ప్రాంత అభివృద్ధి అధికారిక సంస్థకు 250 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. అలాగే వేములవాడ దేవాలయ ప్రాంత అభివృద్ధి అధికారిక సంస్థకు 100 కోట్ల రూపాయలు, భద్రాద్రి ప్రాంత అభివృద్ధి అధికారిక సంస్థకు 100 కోట్లు, బాసర సరస్వతీ ఆలయం అభివృద్ధికి 50 కోట్లు, ధర్మపురి ఆల య అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు కేటాయించారు. అర్చకలు, ఆలయ ఉద్యోగులకు 2015 పీఆర్‌సీకి సమానంగా వేతనాలు చెల్లించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో 72 కోట్ల రూపాయలు కేటాయించారు.
వివిధ ఆలయాల పునరుద్దరణకు సంబంధించి ఏర్పాటు చేసిన కామన్ గుడ్ ఫండ్‌కు 50 కోట్ల రూపాయలు కేటాయించారు.