తెలంగాణ

ఆసుపత్రి నుంచి స్వామిగౌడ్ డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నార్సింగి, మార్చి 15: సరోజనిదేవి కంటి ఆసుపత్రి వైద్యులు ఎంతో చక్కగా వైద్యం చేశారని వైద్యులతోపాటు సిబ్బందికి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అసెంబ్లీలో కుడికంటికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ వైద్యులతో పాటు ఆసుపత్రిలో పనిచేసే ప్రతి సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా పలకరించి పేర్కొన్నారు.
సోమవారం పదకొండు గంటల ప్రాంతంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారని సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ తెలిపారు. వెంటనే చికిత్స ప్రారంభించామని అన్నారు. కార్నియా 50 శాతం దెబ్బతిందని, బీపీ, షుగర్ ఎక్కువగా ఉండటంతో చికిత్స చాలా సున్నితంగా చేశామని చెప్పారు.
ఆసుపత్రి ఆర్‌ఎంఓ నాజఫీ బేగం, డాక్టర్లు వీ.రాజలింగం, పీ.మొదినీ, కే.శ్రీనివాస్ ప్రసాద్‌తో పాటు గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తి ప్రవీన్ కుమార్ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్