తెలంగాణ

కేసీఆర్‌ను గద్దె దింపే వరకూ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, కెసిఆర్ నాయకత్వాన్ని గద్దెదించాలని, అంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలతో కలిసి సమిష్టిగా ఉద్యమిస్తారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలపై వీడియో ఫుటేజిని బహిర్గతం చేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. కాంగ్రెస్‌పై బురదజల్లేందుకు కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఉంటే, తమ బండారం ఎక్కడ బయటపడుతుందనే భయపడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసినందుకు నిరసనగా దీక్ష చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి తదితరులు నిమ్మరసం చేసి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి అధినేత మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కెసిఆర్ శాపంగా పరిణమించారన్నారు. తెలంగాణ సాధనకు కాంగ్రెస్ ఉద్యమించిందన్నారు.
తెలంగాణ జాక్‌తో ఉద్యమం చేసి సోనియా గాంధీ ఆశీస్సులతో ప్రత్యేక రాష్ట్ర సాధన కల సాకారం చేశామన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కోదండరామ్, విమలక్క, గద్దర్, ఈ రోజు కెసిఆర్‌కు శత్రువులయ్యారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించినందుకు కెసిఆర్ సిగ్గుపడాలన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చి ఉండకపోతే ముఖ్యమంత్రి పదవిలో కెసిఆర్ ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవన్నారు.
కెసిఆర్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగాసర్వ నాశనమైందన్నారు. అవాస్తవాలు,తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టిఆర్‌ఎస్ వ్యవహరిస్తోందన్నారు.

చిత్రం..కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పీ నేత జానారెడ్డి తదితరులు
నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేయస్తున్న దృశ్యం