తెలంగాణ

పప్పు దినుసుల విత్తనాల ధర మరింత తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ రాష్ట్రంలో పప్పు విత్తనాల ధరలను మరింత తగ్గించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన ధరలకన్నా ఇవి మరింత తక్కువగా ఉన్నాయి. 2016 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం’ గా ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కందిపప్పు విత్తనం ధర ఐదురోజుల క్రితం క్వింటాల్‌కు 7750 రూపాయలుగా నిర్ణయించగా, శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ ధర 6230 రూపాయలు ఫిక్స్ చేశారు. అలాగే పెసర విత్తనాల ధరను ఇంతకు ముందు క్వింటాల్‌కు 7750 రూపాయలు ఉండగా తాజా నిర్ణయం ప్రకారం ఈ ధర 6250 రూపాయలైంది. ఉలవ విత్తనాల ధర ఇంతకు ముందు క్వింటాల్‌కు 9750 రూపాయలు ఉండగా తాజా నిర్ణయం ప్రకారం ఇది 5470 రూపాయలైంది. పత్తిపంట విస్తీర్ణం గత కొంత కాలంగా పెరుగుతూ వస్తోందని, దాంతో పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడంతో దీని విస్తీర్ణాన్ని తగ్గించాల్సి వస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా పలు పర్యాయాలు ప్రకటించారు. పత్తి స్థానంలో పప్పుదినుసులు, నూనె పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పప్పుదినుసులు, నూనె విత్తనాల ధరలను తగ్గించి రైతులకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో వాస్తవంగా ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమం, సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంటలు ఎక్కువగా వేసేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోంది.