తెలంగాణ

ఎస్‌ఇ గారూ.. సెలవుపై వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: మిషన్ కాకతీయ పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పనుల పురోగతిలో చాలా వెనకబడ్డారని వరంగల్ జిల్లా ఎస్‌ఇ విజయ భాస్కర్‌ను సెలవుపై వెళ్లాలని మంత్రి ఆదేశించారు. మిషన్ కాకతీయ 1, 2 పనులపై జిల్లాల వారిగా మంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర సగటు కన్నా వెనుకబడిన రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వరంగల్ ఎస్‌ఇపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఆ స్థానంలో కొత్త ఎస్‌ఇని నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులను మే నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ సర్ట్ఫికెట్ తరువాతనే ఫైనల్ బిల్స్ నమోదు చేయాలని ఆదేశించారు. ఐదు కంటే ఎక్కువ టెండర్లు పొందిన ఏజెన్సీలకు ఐదు పనులకే పరిమితం చేయాలని అన్నారు. మిగతా టెండర్లను యల్2ను యల్1 రేట్లకే పనులు చేసేందుకు సంప్రదించాలని సూచించారు. ఆర్ ఆర్ ఆర్ కోసం 556 చెరువులను 100 ఎకరాల ఆయకట్టుకు తగ్గకుండా ఉన్న వాటిని ఎంపిక చేసి వెంటనే డిపిఆర్‌లు తయారు చేయాలని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గంలో మూడు మండలాల్లో మిషన్ కాకతీయ పనులు ఒక్కటి కూడా మొదలు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మూడు మండలాలు వచ్చే వీడియో కాన్ఫరెన్స్ నాటికి పురోగతి చూపించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి అన్ని చెరువుల తూములు మూసి ఉంచాలని, గేట్లు లేని వాటికి గేట్లు అమర్చాలని చెప్పారు. టెండర్లు పొంది అగ్రిమెంట్‌కు రాని ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి వెంటనే మళ్లీ టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. కొత్త ఇంజనీర్లు ఎవరికీ ఐదేళ్ల వరకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వరాదని, అదే విధంగా ప్రమోషన్ పొందిన ఇంజనీర్లకు కూడా హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇవ్వరాదని మంత్రి ఆదేశించారు. నల్లగొండ జిల్లా భీమ లింగంపల్లి కెనాల్‌కు సంబంధించిన అనుమతులు త్వరలో ప్రభుత్వం నుండి వెలువడుతున్నందున ఆ పనులకు సంబంధించి టెండర్లను పిలవాలని నల్లగొండ ఎస్‌ఇని ఆదేశించారు.
తొలి జీతం మిషన్ కాకతీయకు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజనీర్ పందిర్ల అశోక్ కుమార్ తన తొలి వేతనం 50వేల రూపాయలను మిషన్ కాకతీయకు అందజేశారు. నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు విరాళం అందజేశారు.