తెలంగాణ

ఇకనైనా కేంద్ర పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణాత్మక విమర్శలను తప్పక స్వీకరిస్తాం ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తే తప్పుపడతారా?
కేంద్రం చేసే అప్పుల్ని దుబారా అనగలమా? ఏడెనిమిది శాఖలు కేంద్రం పరిధిలో ఎందుకు?
జలవనరులు ఎందుకు వాడుకోలేకపోతున్నాం.. మండలిలో సీఎం కేసీఆర్ ప్రశ్నల పరంపర

హైదరాబాద్ మార్చి 21: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడిచినా 130 కోట్ల జనాభాను ఎలా పరిపాలించాలన్న విషయంపై అవగాహనలేని పార్టీలు, పాలకులు బుద్ధి తెచ్చుకోవాలని సీఎం కె చంద్రశేఖర్ రావు హితవు పలికారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాల్సిన అవసరముందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బుధవారం శాసనమండలిలో కేసీఆర్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం జీఎస్‌డీపీలో చైనా మనకన్నా ఎంతో వెనుకబడి ఉండేదని, నేడు చైనా జీఎస్‌డీపీలో భారత్‌కు నాలుగో వంతు కూడా లేదన్నారు. చైనాలో నార్త్ చైనా నుంచి సౌత్ చైనాకు 2400 కిలోమీటర్ల మేరకు 1600 టీఎంసీ నీటిని తరలించి సాగుకు అందిస్తున్నారని, మన దేశంలో ఈ రకంగా నీళ్లిచ్చే అవకాశముందా? అని ప్రశ్నించారు. దేశంలో సుమారు 40 కోట్ల ఎకరాల భూమిలో వ్యవసాయం కొనసాగుతుందని, ఇందులో 70 శాతం అంటే 30 కోట్ల ఎకరాల్లో వివిధ రకాలుగా సాగు జరుగుతోందని వివరించారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేరకమైన పంటలు పండవని, అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి రకరకాలుగా వ్యవసాయం చేస్తుంటారని సీఎం వివరించారు. దేశంలో పుష్కలంగా నీరున్నా సాగుకు అవసరమైన నీటిని అందించని పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని అన్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాటర్ వార్‌లు కొనసాగుతున్నాయని, మనకు నీటి వాటాను తేల్చేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి 14 ఏళ్లు గడుస్తున్నా ఇంకా వివాదం ఎడతెగలేదని, ఎపుడు తెగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. దేశంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే అవకాశమున్నా ఎందుకివ్వటం లేదని ప్రశ్నించారు. ఏటా సుమారు 70వేల టీఎంసీ నీరు సముద్రంలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన పరిధిలో విద్యా, వైద్యం, పట్టణాభివృద్ధి వంటి ఏడెనిమిది కీలకమైన శాఖలను పెట్టుకోవటం అవసరమా? ఎక్కడో ఉండి మారుమూల గ్రామాల్లో పాఠశాల, ఆసుపత్రులను నడపటం ఏమిటీ? అని ముఖ్యమంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. అప్పుల విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు సుమారు రూ.80లక్షల కోట్ల పైచిలుకు అప్పులున్నాయని, అందులో రూ. 24లక్షల కోట్ల పైచిలుకు అప్పులు మోదీ ప్రభుత్వం తీసుకున్నదేనని, దాన్ని మనం దుబారా అనగలమా? అని బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించే ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఇంకా పరిణితి చెందాలన్నారు. జీఎస్‌టీ వచ్చిన తర్వాత ఇంకా కోలుకోని రాష్ట్రాలున్నాయని, కానీ మన రాష్ట్రం వృద్ధి రేటులో నెంబర్ వన్‌గా ఉందని వివరించారు. నేటికీ తెలంగాణ రాష్ట్రం 21 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు ఉందని వివరించారు. తమతో పోల్చితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అప్పులు రెండింతలున్నాయని, ఇటీవల తాను అక్కడకి వెళ్లినపుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే తెలిపారని వెల్లడించారు. ఎపుడూ తమ అభివృద్ధిని అభినందించాలని తాము కోరుకోవటం లేదని, నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరిస్తామని అన్నారు. తాము రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం, ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి పరిమితంగా అప్పులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని, ఇపుడు అప్పులు చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టులు మున్ముందు రాష్ట్రానికి పెద్ద ఆస్తులుగా మారుతాయని వివరించారు.