తెలంగాణ

పంటకు పెట్టుబడి ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచంలోనే పంటకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెప్పారు. పంటకు తగిన సొమ్ములేక ఎంతో మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఈ పధకానికి రూపకల్పన చేశారని చెప్పారు. గత పాలకులు వ్యవసాయం గురించి పట్టించుకునే ఉంటే ప్రస్తుతం రైతులకు ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. చట్టసభల్లో ఉన్నవారంతా తాము రైతు బిడ్డలమని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూ వచ్చారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన వెనువెంటనే ఓ వైపు మిషన్ కాకతీయ ద్వారా చెరులకు పుర్వవైభవం తీసుకురావడంతో పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేశామని చెప్పారు. దీంతో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. గతంలో రెండవ పంటకు నీరులేక, విద్యుత్ సక్రమంగా అందదన్న భయంతో సాగు చేసేందుకు జంకే వారిని స్వయంగా రైతైన ముఖ్యమంత్రి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని సంకల్పించి దానిని సకారం చేశారని చెప్పారు. నిరంతరాయంగా విద్యుత్, పెరిగిన భూగర్భజలాలకు తోడు పంట సాయం ప్రభుత్వమే అందిస్తుండటంతో రైతు లు ఆనందంగా ఉన్నారని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ఓ సాహసోపేతమైన చర్య అని, 1931లో నిజాం కాలంలో రికార్డుల ప్రక్షాళన అనంతరం ప్రస్తుతం చేపట్టడం జరిగిందని అన్నారు. వీటి ఆధారంగా యజమానులను గుర్తించి సహాయం అందించనుందని వివరించారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తే ప్రమా దం ఉన్నందున కౌలు రైతులకు పంట సహా యం చేయలేమని స్పష్టం చేశారు. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతులను ఉన్నతులుగా తీర్చిదిద్దే క్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.