తెలంగాణ

పాలమూరుకు కృష్ణా జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: నారాయణపూర్ డ్యామ్ నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణా జలాలను కర్నాటక విడుదల చేసింది. కర్నాటక నీటి విడుదల గురించి నారాయణపూర్ సిఇ మహబూబ్‌నగర్ సిఇ ఖగేందర్‌రావుకు అధికారికంగా సమాచారం పంపించారు. మంగళవారం నాటికి నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒక టిఎంసి కృష్ణా జలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటాయి. పది రోజుల క్రితమే నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేసిన రాజకీయం కారణంగా ఆలస్యమైందని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. నీటి విడుదల కోసం మంత్రి తన్నీరు హరీశ్‌రావు కర్నాటక వెళ్లి ప్రభుత్వంతో చర్చించిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆ రాష్ట్ర సిఎంను కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బెంగళూరు వెళ్లి తమ వినతిపత్రం మేరకే కర్నాటక నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది అని, క్రెడిట్ తమకే దక్కాలని చేసిన ప్రయత్నం వల్ల పది రోజుల ఆలస్యమైందని నీటిపారుదల రంగం వర్గాలు తెలిపాయి. తీవ్రమైన కరవుతో ఇబ్బంది పడుతున్న మహబూబ్‌నగర్ జిల్లాకు కనీసం మంచినీటిని అందించేందుకు నారాయణపూర్ డ్యామ్‌నుంచి మూడు టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. చివరకు ఒక టిఎంసి నీటిని విడుదల చేసేందుకు కర్నాటక అంగీకరించి, ఆదివారం నీటిని విడుదల చేసింది.