తెలంగాణ

అంగట్లో పది ప్రశ్నపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్‌రూరల్: రాష్ట్ర, జిల్లాస్థాయి లో మెరిట్ సాధిస్తే తమ స్కూల్‌లో అందరూ అడ్మిషన్లు చేయించుకుంటారని భావించిన ఒక స్కూల్ యాజమాన్యం పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌చేసి సిబ్బందితో జవాబులు రాయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఉదంతానికి సంబం ధించి ఏడుగురిని అరెస్ట్ చేయగా, ప్రభుత్వ అధికారి పరారీలో ఉన్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వెంకటేశ్వర జనరల్ స్టోర్ యజమాని రమణ ప్రశాంత్ అలియాస్ చిన్న తన కూతురు ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదివి ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదికి పరీక్షలు రాస్తోంది. తన కూతురు స్టేట్ మెరిట్ సాధించాలన్న తపనతో విద్యార్థి తండ్రి చిన్న లక్ష్మణచాంద జడ్పీ ఎస్‌ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాధు మన్మథ్‌రెడ్డితో పరీక్ష పత్రాలను వాట్సప్ ద్వారా లీక్ చేయిస్తున్నాడని ఖానాపూర్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. లీకైన ప్రశ్నపత్రాలను తన స్నేహితుడైన కృష్ణవేణి స్కూల్‌లో పి ఈటిగా పనిచేస్తున్న సట్ల గంగాధర్‌కు ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించాడు. ఈ అవకాశాన్ని కృష్ణవేణి స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రభుత్వ కళాశాలలో ఇన్విజిలేటర్లు, పనిచేస్తున్న అధికారులతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు గురువారం కృష్ణవేణి స్కూల్ లోపలికి వెళ్లగా లోపలికి రావద్దని పోలీసులను యాజమాన్యం బెదిరించడంతో అనుమానం వచ్చిన పోలీసులు శుక్రవారం సీఐ అశోక్ తన సిబ్బందితో ఉదయం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పై అంతస్తు లోకి వెళ్లి పరిశీలించగా స్కూల్ సిబ్బంది, కరస్పాండెంట్, సైన్స్ టీచర్ కలిసి శుక్రవారం జరుగుతున్న సైన్స్ పరీక్షకు జవాబు పత్రాలను తయారుచేస్తున్నారు. వెంటనే వారివద్ద నున్న గైడ్స్, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీ నం చేసుకుని వారి సెల్‌ఫోన్లను పరిశీలించగా వ్యాపారవేత్త రమణ ప్రశాంత్ అలియాస్ చిన్న వాట్సాప్ నుండి కేటీయస్‌లో పనిచేసే పీఈటి గంగాధర్‌కు ప్రశ్నపత్రాన్ని పంపినట్టు ఆధారాలు దొరికాయ. ఈ ఆధారాల ద్వారా చిన్నాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తనకు లక్ష్మణచాంద మండలం జడ్పీ ఎస్‌ఎస్ పాఠశాల స్కూల్‌అసిస్టెంట్ సాధు మన్మథ్‌రెడ్డి నుండి ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా వచ్చిందని ఆయన గంగాధర్‌కు పంపించానని గుట్టు రట్టుచేశాడు. నిందితులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని సెక్షన్ 8/ ఏపి ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలియజేశారు.
పరారీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
పదవ తరగతి ప్రశ్నపత్రాన్ని లీక్‌చేసిన విషయం ఖానాపూర్‌లో సంచలనం కాగానే విషయం తెలుసుకున్న లక్ష్మణచాంద జడ్పీ ఎస్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సాధు మన్మథ్‌రెడ్డి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పటి నుండి ఇదే క్రమం లో పరీక్ష పత్రాలను లీక్‌చేస్తూ జవాబులు కృష్ణవేణి టాలెంట్ నుండి పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సమాధాన పత్రాలుచేరవేసి పరీక్షలురాయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం..అరెస్ట్ అయిన కృష్ణవేణి ట్యాలెంట్‌స్కూల్ సిబ్బంది, వ్యాపారవేత్త చిన్న