తెలంగాణ

క్రీమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న బీసీ క్రిమీలేయర్ అమలు నిర్ణయాన్ని రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీసీలను విభజించి పాలించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తోందని, 6లక్షల ఆదాయం ఉన్న బీసీలకు రిజర్వేషన్ వర్తించదంటే ఎలా అని ప్రశ్నించారు. క్రిమీలేయర్‌కు శాస్ర్తియత, హేతుబద్ధత లేదని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో క్రిమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 1993లోనే నాటి ప్రభుత్వాలు క్రిమీలేయర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయని దీనిపై తీవ్ర నిరసనలు వచ్చాయన్నారు. టిఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు దీనిని అడ్డుకోవాలని, లేకుంటే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఒక శాతం కూడా లేని కులం రాష్ట్రాన్ని పాలిస్తోందని, 52 శాతం ఉన్న బీసీలను అణచివేసేందుకు యత్నిస్తోందన్నారు. బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా హిజ్రాలను బీసీల్లో కలుపుతామని ప్రకటించారన్నారు. క్రిమీలేయర్ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ ఈ నెల 24న హైదరాబాద్‌లో ఉద్యోగ, రాజకీయ సంఘాలతో అఖిలపక్షం నిర్వహిస్తామని, 26న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 27న హైదరాబాద్‌లో తాను దీక్ష చేస్తానన్నారు. 30వ తేదీన సమావేశం ఉంటుందన్నారు. ఆ తర్వాత 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య