తెలంగాణ

ప్రైవేట్ కాలేజీల తనిఖీకి పోలీసుల సహాయం తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలను విద్యాశాఖ సిబ్బంది మాత్రమే తనిఖీ చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ యూనిఫాంలో ఉన్న పోలీసులను వెంట తీసుకెళ్లరాదని, ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్ ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రైవేట్ కాలేజీల తనిఖీలో పోలీసుల సహాయాన్ని విద్యాశాఖాధికారులు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ గౌతమి, విజ్ఞాన్ డిగ్రీ కాలేజీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పివి సంజయ్‌కుమార్ ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, కాలేజీలో తనిఖీలో పోలీసుల సహాయాన్ని విద్యాశాఖాధికారులు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విద్యాశాఖాధికారులు మరో సర్క్యులర్ జారీ చేశారని, సింగిల్‌జడ్జి ఆదేశాలకు ఇది విరుద్ధమంటూ ఎస్ శ్రీరాం అనే న్యాయవాది ప్రైవేట్ కాలేజీల తరఫున వాదించారు.