తెలంగాణ

గోదావరి బ్యారేజిపై మహారా్ర ష్ట ‘ప్రాణ’ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 22: గోదావరి బేసిన్‌పై రిడిజైనింగ్ మార్పులతో ప్రాణహిత వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజి నిర్మాణాలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. కౌటా ల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ని ర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తిపోతలకు 148 మీటర్ల అడుగుల ఎత్తువరకే అనుమతిస్తామని ముందునుండి పట్టుబడుతూ వచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకుంది. మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఇరిగేషన్ అధికారుల బృందం నాగ్‌పూర్‌లో అక్కడి జలవనరుల మంత్రి గిరీష్ మహాజన్‌తో అంతరాష్ట్ర గోదావరి జలాల వివాదంపై చర్చలు జరపగా ప్రాణహిత, పెన్‌గంగా బ్యారేజీల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతేగాక గతంలో కుదిరిన ఒప్పందం మేరకు లోయర్‌పెన్‌గంగా బ్యారేజి కోసం చెనాకకోర్ట వద్ద పనులు మొదలుపెట్టడానికి తమ అభ్యంతరాలు ఏమిలేవని తేల్చిచెప్పింది. మరోవైపు సుమారు ఏడేళ్లుగా వివాదాస్పదంగా మగ్గుతున్న ప్రాణహిత చేవెళ్ల బ్యారేజి విషయంలో తమ ప్రాంతానికి ముప్పు సమస్య తలెత్తకుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తు వరకే బ్యారేజి నిర్మించుకోవాలని సూచించగా, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకారం కుదుర్చుకుంది. గతంలో మహారాష్ట్ర అనుమతులతో సంబంధం లేకుండా పనులు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. ఇక్కడే ప్రాణహితలో నీటి సామార్థ్యం నిలువ, మహారాష్ట్ర అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద మొదటి దశలో నిర్మించనున్న బ్యారేజి ఎత్తిపోతల పథకం ద్వారా 40 నుండి 45 టిఎంసీల నీటిని తరలించి, ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అయితే 2008లో ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టు కాలువల నిర్మాణం, సర్వే పనులు, అడ్వాన్స్ మోబలైజేషన్, భూసేకరణ తదితర పనులకు ప్రభుత్వం 7వేల కోట్ల వరకు ఖర్చుచేయగా, ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం గోదావరి బేసిన్‌పై నదీ జలాల వినియోగంలో భాగంగా ప్రాణహిత రిడిజైనింగ్ కోసం లైడార్ సర్వే నిర్వహించి, మొదటి దశలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మించాలని నిర్ణయించింది. రెండవ దశలో కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి బ్యారేజి పనులు ప్యాకేజీల వారీగా పూర్తిచేయాలని నిర్ణయించింది. మొదటి దశలో కౌటాల మండలం రణవెల్లి నుండి బెజ్జూర్ మండలం కర్జెల్లి వరకు, రెండవ ప్యాకేజీలో కర్జెల్లి నుండి నెనె్నల మండలం మైలారం వరకు, మూడవ విడత ప్యాకేజీని తుమ్మిడిహెట్టివద్ద బ్యారేజి నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రాజెక్టు రూపకల్పన గావించారు.
సాంకేతిక అంశాలపై
29, 30 తేదీల్లో మరో భేటీ
గోదావరి బేసిన్‌లోని కాళేశ్వరం మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి నిర్మాణంలో భాగంగా సాంకేతిక సమస్యలపై చర్చించేందుకు ఈనెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించనున్నారు.