తెలంగాణ

డిండి డిజైన్.. మళ్లీ మారెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 20: కరువు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగుతాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో ప్రభుత్వం మరోసారి మార్పులకు సిద్ధపడింది. ప్రాజెక్టు నూతన డిజైన్‌లో భాగంగా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ప్రాజెక్టు పరిధిలో మరో 70వేల ఎకరాలకు సాగునీరు అం దించాలని ఇందుకోసం మరో మూడు రిజర్వాయర్లను ని ర్మించాలని నిర్ణయించుకుని పనుల నిర్వాహణకు త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తుంది. దీంతో 6,500 కోట్ల అంచనా వ్యయంతో 3.19లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు లక్ష్యం 4లక్షల 70వేలకు పెరిగిపోగా నిర్మాణ వ్యయం 8,500కోట్లకు పెరుగనుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగమైన డిండి ఎత్తిపోతల పథకంలో శ్రీశైలం నుండి ఎత్తిపోతలతో నార్లపూర్ రిజర్వాయర్‌కు వచ్చే నీటిలో 60రోజుల పాటు రోజుకు అర టిఎంసి చొప్పున 30టిఎంసిల కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఇక్కడి నుండి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్‌లకు నీరందిస్తారు. ఇటీవల హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంచినీటిని అందించే లక్ష్యంతో శివన్నగూ డెం రిజర్వాయర్ నుండి ఎడమ, కుడి కాలువకు అదనంగా రాచకొండ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి రాచకొండ గుట్టల్లో వాయిళ్లపల్లి రిజర్వాయర్‌ను నింపి, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లోని 15చెరువులు నింపాలని కొత్తగా డిజైన్ చేశారు. వాయిళ్లపల్లి నుండి ఇబ్రహీమ్‌ప ట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో 60చెరువులకు నీరందించేందుకు రోజుకు 0.10టీఎంసీల చొప్పున 60రోజుల పాటు ఆరు టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం 700కోట్ల అదనపు వ్యయంతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేశారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజజకవర్గంలోని బల్మూర్, అమ్రాబాద్ మండలాల్లో మరో 70వేల ఎకరాలకు నీరందించాలన్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్తగా రీడిజైన్ చేసి డీపీఆర్ రూపొందించారు. నార్లాపూర్-ఉల్పరల మధ్య కొత్తగా ఉల్పర వద్ధ 0.255 టీఎంసీ, ఎర్రబెల్లి గోకారం వద్ధ 1.095 టీఎంసీ, ఇర్వి వద్ధ 0.447 సామర్థ్యంతో నూతనంగా రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత డిజైన్ మేర కు డిండి ఎత్తిపోతల పథకంలో ఇప్పటిదాకా 11రిజర్వాయర్లను నిర్మించనుండగా వాటి నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్ధ్యాలలో మార్పులకు అవకాశం లేకపోలేదు.
ఆలస్యంగా సాగుతున్న ప్రాజెక్టు పనులు
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు కృష్ణా వరద జలాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు 2015 జూ న్ 12న శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ రెండున్నర ఏళ్లలో పనులు పూర్తిచేసి నీరందిస్తామని ప్రకటించారు. అ యితే కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో డిండి ఎత్తిపోతల పథ కం పనులు జోరందుకోకపోవడం, తరుచుగా డి జైన్ల మా ర్పు, టెండర్ల ఖరారులో, భూసేకరణలో తీవ్ర జా ప్యం సా గడం పనుల పురోగతికి సమస్యగా మారింది. తొలుత డిం డి ఎత్తిపోతలకు ఎదులా, నార్లాపూర్‌లలో ఎక్కడి నుండి నీ రు తీసుకోవాలనే దానిపై జాప్యం సాగింది. చివరకు నార్లాపూర్ నుండి నీటిని తీసుకోవాలన్న అలైన్‌మెంట్ ఖరారైనా ఆయకట్టు విస్తీర్ణం, రిజర్వాయర్ల నిర్మాణాల్లో మా ర్పులు చోటుచేసుకున్నాయి. తదుపరి రాచకొండతో పాటు అమ్రాబాద్, అచ్చంపేట ప్రాంతాలకు పథకాన్ని పొడగించడంతో ప్రాజెక్టు పనులు మరింత కాలం సాగనున్నాయి. 2016 డి సెంబర్ 18న మొదలైన శివన్నగూడెం రిజర్వాయర్ పనులతో పాటు ఇతర రిజర్వాయర్ల నిర్మాణ పనులు ఆలస్యం గా సాగుతున్నాయి. గత ప్రభుత్వాల హాయంలో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టుల మాదిరిగానే ఆలస్యంగా సాగుతుండటంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.

చిత్రం.. డిండి రిజర్వాయర్