తెలంగాణ

త్వరలో ఐదు వేల నాట్ల యంత్రాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, మే 28: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద త్వరలో రాష్ట్రంలో 5 వేల నాటు యంత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే ఎకరానికి నాలుగు వేల చొప్పున పంటసాయం అందించడంతో పాటు, నూతన పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ పథకంలో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తున్నా జూన్ 20 నాటికి ఇలాంటి పొరపాట్లు కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని చెప్పారు. రెండో విడత నాలుగు వేల రూపాయలను నవంబర్ లో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. రాష్ట్రం లో ఉన్న 1.42 కోట్ల ఎకరాల సాగుభూములకు రైతుబంధు పథకం ద్వారా 12వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు జూన్ 2 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రైతులకు బీమా పథకాన్ని అమలు చేయనుందన్నారు. ఈ బీమా పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి రైతుకు బీమాను వర్తింప జేయడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం ఒక్కో రైతుకు సుమారు 2200 రూపాయలను చెల్లిస్తుందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై వెయ్య కోట్ల భారం పడనుందని సుఖేందర్‌రెడ్డి చెప్పారు. బీమా పథకం కింద నామినీల పేర్లను రైతులు తమ వద్దకు వచ్చే వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సీజన్‌లో రైతులు పండించిన 25 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిందని చెప్పారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 4.25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఇందుకు గాను ప్రభుత్వం రైతులకు ఇప్పటికే 650 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందని పెండింగ్‌లో ఉన్న 250 కోట్ల రూపాయలను వారం రోజుల్లో రైతులకు చెల్లించడం జరుగుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ రైతులకు లబ్ధి కలిగించే అనేక పథకాలను ప్రవేశపెట్టి లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడన్నారు. వ్యవసాయానికి మరింత అండగా నిలబడాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ రైతులకు యాభై శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందించడం, రైతుబంధు పతకం ద్వారా ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున పంట సాయం చేయడం, రైతులకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.