తెలంగాణ

జూన్ 24న ఓబీసీ జాతీయ మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: దేశవ్యాప్తంగా ఉన్న బీసీ కులాలన్నింటికి న్యాయం చేసేందుకు జాతీయ స్థాయిలో ఓబీసీలను శాస్ర్తియంగా విభజించాలని డిమాండ్ చేస్తూ జూన్ 24న ఢిల్లీలో ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహించనున్నట్టు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఓబీసీలు 2,576 కులాలు ఉన్నాయని, దేశజనాబాలో 60శాతం మంది ఉన్న ఓబీసీలను ఉప వర్గీకరణ చేయాలని కోరారు.
వర్గీకరణ ద్వారానే అన్ని కులాలకు సమాన అవకాశాలు లభిస్తాయని అన్నారు. జనాబాలో సగానికి పైగా ఉన్న బీసీ కులాలు ఇప్పటికీ కేవలం ఓటుబ్యాంకుగానే ఉండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా బీసీలు రాజకీయంగా ఎలాంటి పురోగతిని సాధించలేక పోతున్నారని వాపోయారు. రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగ రంగంలో కూడా బీసీలకు అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ కులాలన్ని అభివృద్ధి చెందాలంటే జాతీయ స్థాయిలో శాస్ర్తియంగా వర్గీకరణ తప్పని సరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే మహాసభను ఢిల్లీలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.