తెలంగాణ

టీజేఏసీ పుట్టింది జనం కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 28: తెలంగాణ వచ్చింది కుటుంబపాలన కోసం కాదని కుటుంబపాలనకు చరమగీతం పాడేందుకు యావత్తు తెలంగాణ సమాజం అంతా నడుం బిగించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని అల్మస్ ఫంక్షన్‌హల్‌లో టీజెఎస్ ఒకరోజు శిక్షణ తరగతుల కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హజరయ్యారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన టీజెఎస్ శిక్షణ తరగతుల్లో 8 అంశాలపై సుదీర్ఘంగా నాయకులకు, కార్యకర్తలకు పలువురు శిక్షణను ఇచ్చారు. శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో కోదండరాం రాజకీయ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీజేఏసీ పుట్టింది జనం కోసమని తెలంగాణ ఆమరవీరుల ఆకాంక్షలను నేరవేర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమనే భావించే టీజెఎస్‌ను ఆవిర్భవింపజేశామన్నారు. టీజెఎస్ మనుగడ ఉంటుందో లేదోనని అనుమానాలు ఉండేవని ఇక ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయని వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం ఇందుకు మంచి స్పందన లభించడంతో తమకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీల్లోకి దిగుతామని తమ సత్తా ఎమిటో చాటుతామన్నారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని రాజకీయ అడుగులు పెట్టామని ఇది ఎటునుండి ఎటువైపు పరుగులు తీస్తుందో త్వరలోనే అందరికి అర్థం అయ్యేవిధంగా ఉంటుందన్నారు. గ్రామపంచాయతీ నుండి మొదలుకుని అసెంబ్లీ వరకు పోటీ చేస్తామని తెలిపారు. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారంతా తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల పేరిట సర్కార్ కమిషన్లను దండుకుంటుందని రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రభుత్వంలోని పెద్దలే అవినీతిని ప్రొత్సహిస్తుంటే రాష్ట్రం అప్పుల పాటు కాకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. దనిక రాష్ట్రం అని చెప్పుకున్న పాలకులు అప్పుల రాష్ట్రంగా ఎలా మార్చారని ఆయన ప్రశ్నించారు. ఒక కుటుంబం కోసం తెలంగాణ రాలేదని ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ వచ్చిందన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ జటిలంగా మారిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్ద దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందుకు యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రెండు విభాగాలుగా విభజించి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు జరిగేదన్నారు. జూరాల ప్రాజెక్టు నుండి కూడా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణాజలాలను అందించినట్లు అయితే ఈ ప్రాంత రైతులంతా సుభిక్షంగా ఉంటారన్నారు.