తెలంగాణ

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పేద, మధ్య తరగతి రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో భాగంగా డయాలసిస్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్‌ల ను ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నాలుగేళ్ళలో రాష్ట్రం వైద్య రంగంలో ఎంతో ముందుకు వెళ్ళిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే, స్వరాష్ట్రంలో జిల్లావాసులకు 24గంటలపాటు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని అన్నారు. నాలుగేళ్ళలో వైద్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, సమూల మార్పులు తెచ్చినట్లు వెల్లడించారు. గతంలో నగరంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఐసియూ సౌకర్యం కూడా లేని దుస్థితిలో ఉండగా, తాజాగా డయాలసిస్ కేంద్రానే్న ఏర్పాటు చేసి, పూర్తి స్థాయి వైద్యులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కూడా 40 డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో మరో రెండు అర్బన్ హెల్త్ సెంటర్ల కోసం వచ్చిన ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 14 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, ఇప్పటివరకు ఐదు కేంద్రాలు ప్రారంభించామన్నారు. అన్ని పాత జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆర్ధిక, పౌర సరఫరాల శాఖామంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు పెద్దపీట వేసి, వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేశాయని, తమ ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు ఉత్తమ వైద్య సేవలందిస్తుందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్‌కార్డులు మంజూరు చేసిందని, ఇప్పటివరకు 8,900 మందికి జారీ చేశామన్నారు. ప్రతి జర్నలిస్టు ఆరోగ్య కార్డు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెల్త్‌కార్డులున్న వారికి వెల్‌నెస్ కేంద్రాల్లో ఉచిత వైద్య పరీక్షలతో పాటు, మందులు కూడా అందజేస్తారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఒక జర్నలిస్టుకు కాలేయ మార్పిడి జరిగితే హెల్త్‌కార్డు ద్వారా రూ. 23 లక్షలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ, నూతన ఒరవడికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టల కోసం ఏర్పాటు చేసిన వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నల్లగొండ జిల్లాలో పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కాలేయ మార్పిడి జరిగితే ఈపథకం ద్వారా రూ. 26 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కరీంనగర్‌లో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్, వెల్‌నెస్ సెంటర్లకు ప్రారంభోత్సవం, 20 పడకల ఆయుష్ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐటీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..కరీంనగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి,
మంత్రి ఈటల, జెడ్పీచైర్మన్ తుల ఉమ, అల్లం నారాయణ