తెలంగాణ

టీఆర్‌ఎస్ పాలనపై చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ 2019 శాసనసభ ఎన్నికల విజయానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేసి దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా పరివర్తన యాత్ర పేరుతో కార్యాచరణ చేపట్టినట్టు లక్ష్మణ్ తెలిపారు. దశల వారీ యాత్ర చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నెలలో ఒక రోజు దళితవాడలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. జూన్‌లో ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ రానున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. జూన్, జూలై నెలల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రకు శ్రీకారం చుట్టామని లక్ష్మణ్ తెలిపారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో జిల్లాల కార్యవర్గ సమావేశాలు, అనంతరం సభలు జరుగుతాయని చెప్పారు.