తెలంగాణ

అట్రాసిటీ కేసుల జాప్యంపై ప్రభుత్వం అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అలసత్వం పట్ల ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు పరిహారాన్ని నిర్ణీత కాలపరిమితిలో ఎందుకు చెల్లించడం లేదని కలెక్టర్లు, ఎస్‌పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రశ్నించారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బాధితులకు పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి గుర్తు చేసారు. సచివాలయంలో మంగళవారం కలక్టర్లు, ఎస్‌పిలతో సీఎస్ జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టీ అట్రాసిటీస్ కేసులపై జూన్ 6 వరకల్లా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులను ప్రత్యేకంగా సమీక్షించడానికి జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల సమావేశాలు ఏర్పాటు చేసి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. దాడులు జరిగినప్పుడు కలెక్టర్లు, ఎస్‌పీలు వెంటనే స్పందించాలన్నా రు. అట్రాసిటీస్ కేసులు నమోదు అయితే వాటి వివరాలను పోలీసు అధికారులు కలక్టర్లకు తెలియజేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.