తెలంగాణ

కృత్రిమ ఇసుకను ప్రోత్సహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: తెలంగాణలో భవనాలు, ఇతర నిర్మాణాలకు కృత్రిమ ఇసుకను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 37) జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి ఎస్‌కే జోషి పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. నదు లు, వాగుల్లో లభించే ఇసుక ప్రజల అవసరాలకు తగ్గట్టు అందుబాటులో ఉండకపోవడం వల్ల కృత్రిమ ఇసుకను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. వేర్వేరు పరిశోధనా సంస్థలు కృత్రిమ ఇసుకను భవనాలు, ఇతర నిర్మాణాలకు వాడవచ్చని ప్రకటించాయని జీఓలో తెలిపారు. ఈ కారణంగా రోడ్లు భవనాలు, నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల ద్వా రా నిర్మించే భవనాలు, ఇతర నిర్మాణాలకు కృత్రిమ ఇసుక, ప్రకృతిపరంగా (వాగులు, నదులు) లభించే ఇసుకను 50 : 50 శాతం కలిపి వాడాలని జీఓలో సూచించారు.