తెలంగాణ

కొలిక్కిరాని రిజర్వేషన్లు.. తీరని సందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 29: స్థానిక సంస్థల ప్రధానంగా పంచాయతీ ఎన్నికలను జూలై మాసంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, తదనుగుణంగా వడివడిగా చర్యలు తీసుకుంటుండగా, రిజర్వేషన్ల అంశం ఇంకా కొలిక్కిరాకుండా ఉంది. దానితో సంబంధిత ఎన్నికలకై సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్‌ల స్థిరీకరణ నిబంధనల గురించి అన్ని రాజకీయ పార్టీల నాయకులలో, ప్రధానంగా ఆశావహులలో సర్వత్రా చర్చలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వేషన్ స్థిరీకరణ విషయంలో నూతన పంచాయతీరాజ్ చట్ట నియమాలు, జారీ కానున్న సర్క్యులర్‌లు, అధికారులు పాటించిన నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శక సూత్రాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పదవుల కేటాయింపు విషయంలో అధికారులు పాటించాల్సిన నిబంధనల ప్రాతిపదికపై రాజకీయ మేధావుల విశే్లషణలు ఊపందుకున్నాయి. భవిష్యత్తును పరీక్షించుకునేందుకై పోటీ చేసే అవకాశాల గురించి, అనుకూలంగా ఉండగల స్థానాలపై దృష్టి నిలిపి, అధికారుల చుట్టూ తిరుగుతూ, రిజర్వేషన్ ప్రక్రియ గురించి ఆరా తీస్తూ, రిజర్వేషన్‌ల గురించి, రాజకీయ పండితుల, విశే్లషకుల, అనుభవైకవేద్యులైన అధికారులను సంప్రదించి, చర్చించి, తమ రాజకీయ భవితవ్యంపై దృష్టి నిలిపి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పంచాయతిరాజ్ రూల్సు ప్రకారం ప్రతి సాధారణ ఎన్నికలకు ముందు, మొత్తం ఎన్నిక కావలసిన సంఖ్యనుండి, అలాగే జిల్లాలోని మొత్తం సర్పంచుల పదవుల సంఖ్యనుండి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులు, వెనుకబడిన తరగతుల వారికి, స్ర్తిలకు రిజర్వేషను సంబంధించిన నోటిఫికేషను రాష్ట్ర ప్రభుత్వ గజెట్‌లోను, సంబందిత జిల్లా గజెటులోను రూల్సుకు అనుగుణంగా ప్రచురణ గావించి, రిజర్వు చేయాల్సి ఉంటుంది. ప్రతి పంచాయతి లోను షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులు, వెనుకబడిన తరగతుల వారికి, స్ర్తిలకు రిజర్వు చేయాల్సిన పదవుల సంఖ్యను నిర్ణయించి, ఆయా పదవులను రిజర్వు చేయు అధికారం పంచాయతీరాజ్ కమీషనరుకు ఉంటుంది. అలాగే వార్డు సభ్యుల సంఖ్యను జిల్లాల కలెక్టర్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లు, ఓటర్ల ప్రాతిపదికన మిగిలిన స్థానాలు కెటాయించాల్సి ఉంటుంది. విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచి, చట్ట బద్దత కల్పించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికలలోనూ పెంచాయని యోచిస్తున్నది. అయితే బీసీలకు 34%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 6% మొత్తం 58 శాతం కెటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. 50శాతం మించొద్దని సుప్రీం చాలా సందర్భాలలో స్పష్టంగా చెప్పింది. అంతేగాక, ప్రభుత్వం గతంలో 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలనుండి ప్రారంభించి అంటే 1995నుండి ప్రారంభించి, వంతుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలకు రొటేషన్ పద్దతిని, 1994 చట్టం అమలులోకి వచ్చాక జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు అంటే 1995నుండి పాటించారు. నూతన రాష్ట్ర ఆవిర్భావం జరిగి, కొత్త పంచాయతిరాజ్ చట్టం అమలు లోనికి రానున్నందున దీనినే మొదటి సాధారణ ఎన్నికలుగా భావించడం జరుగుతుందని విశే్లషకులు చెపుతున్నారు. 2011 జనాభా, ఓటర్లనే ప్రాతిపదికగా చేసుకుని రిజర్వు చేయడం జరుగుతుందని మేథావుల భావన. జూన్ 10కల్లా రిజర్వేషన్ల సంఖ్యను, ఆపై స్థానాలను రిజర్వు చేయడం జరుగుతుందని పంచాయతిరాజ్ మంత్రి జూపెల్లి కృష్ణారావు ప్రకటించడంతో, రిజర్వేషన్ల ప్రాతిపదికపై చర్చలు ఊపందుకున్నాయి.