తెలంగాణ

సిటీ గ్యాస్ పంపిణీపై వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: దేశంలో ప్రధాన నగరాల్లో ‘సిటీ గ్యాస్ పంపిణీ’ కోసం వేలం పాటలు నిర్వహించడానికి రోడ్డు- షోలు నిర్వహిస్తున్నట్లు పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ అథారిటీ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సిటి గ్యాస్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు తెలంగాణాప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. రెండు రకాలుగా గ్యాస్ పంపిణీని వినియోగదారులకు అందచేయాలని గ్యాస్ అథారిటి బోర్డు యోచిస్తోంది. మొదటిది సిఎన్‌జి ( కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) రెండవది ( పైప్ ద్వారా న్యాచురల్ గ్యాస్) ను పంపిణీ చేయాలని అందు కోసం పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహికులను ఆకర్శించడానికి గ్యాస్ అథారిటి బోర్డు రోడ్డు -షోలు నిర్వహిస్తోంది. దేశంలో హైదరాబాద్‌ను 9వ నగరంగా ఎంపిక చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో సిఎన్‌జితో వాహనాలు నడుస్తున్నాయని సంస్థ గుర్తు చేసింది. సిటి గ్యాస్ పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ప్రాణాధారంగా చూస్తున్నదని వెల్లడించింది. దీని కోసం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహికులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అలాగే పన్నుల్లో రాయితీలు, వౌలిక వసతులు కల్పిస్తామని హామీని కూడా ఇస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో గ్యాస్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి అందుకు వసతులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. దేశంలో బౌగోలిక ప్రాంతాలను గుర్తించామని, ప్రస్తుతం 174 జిల్లాల్లో సిటి గ్యాస్ పంపిణీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో దాదాపు 60 కోట్ల మంది వినియోగదారలకు గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని బోర్డు స్పష్టం చేస్తోంది. దేశంలో వేలం పాటలు నిర్వహించండానకి 15 ప్రాంతలను, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్, లండన్, సింగపూర్‌లలో రోడ్డు షోలు నిర్వహించింది. భారత దేశం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతోంది. న్యాచురల్ గ్యాస్‌తో దేశంలో రూ. 6 కోట్ల పరిశ్రమలు నడుస్తున్నాయని, దీంతో దేశం ఆర్థిక స్థితి అధికమిస్తోందని వెల్లడించింది. రానున్న 2020 సంవత్సరానికి కోటి మందికి వంటింటి గ్యాస్‌ను పంపిణీ చేస్తామని భరోస వ్యక్తం చెస్తోంది. రాబోవు రోజుల్లో వంటింటికి పూర్తి స్థాయిలో గ్యాస్ అందచేయడానకి ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపింది. మంగళవారం నగరంలో జరిగిన రోడ్డుషోలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోసి, సత్‌పాల్ డాగ్, చటర్జీ, ఎ గుప్తా, టి అక్తార్ పాల్గొన్నారు.