తెలంగాణ

సంస్థాగతంగా కాంగ్రెస్ సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ పని తీరును మరింత మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌డీఎంఆర్‌సీ (లీడర్షిప్ డెవలప్‌మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్ కానిస్టేనె్సస్) పని తీరు చాలా బాగున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి ఓటరుతో అనుసంథానమయ్యేలా చేయడమే కాకుండా పోలింగ్ కేంద్రం స్థాయిలో నాయకులు ఓటరుతో నేరుగా కలిసి వారి సమస్యలలో పాలు పంచుకోవడం వంటి పనులు పార్టీకీ చాలా మేలు చేస్తాయని అన్నారు. మంగళవారం గోల్కండ్ హోటల్‌లో జరిగిన ఎల్‌డిఎంఆర్‌సి సమీక్షా సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ ఎల్‌డిఎంఆర్‌సి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరింపజేయాల్సి ఉందన్నారు. ప్రతి ఓటరుతో నాయకులు అనుసంథానంగా ఉండేలా సాంకేతికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాలని, రాబోయే ఎన్నికల్లో సాంకేతిక వనరుల ప్రభావం చాల ఉంటుందని ఈ విషయంలో పార్టీ మరింత లోతుగా సమాచార సేకరణ చేయాలని ఆయన సూచించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సాంకేతిక ప్రభావం ఎన్నికలపై చాలా ఉంటుందని, ఈ విషయంలో ఎల్‌డిఎంఆర్‌సి పని తీరు చాలా బాగుందని 31 నియోజకవర్గాల్లో సమాచార సేకరణ బాగా చేశారని దీనిని మిగతా నియోజకవర్గాల్లో కూడా నిర్వహించి వచ్చే ఎన్నికల నాటికి సమగ్రంగా సమాచార సేకరణ చేసి విరివిగా ఉపయోగించుకునేలా చేయాలని అన్నారు. పార్టీ సంకేతిక విభాగం రూపొందించిన సమాచార పత్రాల ద్వారా పోలింగ్ కేంద్రాల నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి సమాచారం సేకరించి తద్వారా వారికి అవసరమైన సహాయ, సహకారాలు అందించగలిగితే ప్రజలకు పార్టీ మరింత చేరువ అవుతుందని ఉత్తమ్ వివరించారు.
నాలుగున్నర లక్షల మందితో ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు మాట్లాడుతూ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన సమాచార సేకరణ చేసే పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ గ్రూపుల ద్వారా ఓటర్ మ్యాపింగ్ పద్ధతిని పగడ్బందీగా చేయాలని, ఈ సమాచార సేకరణను పార్టీకి మరింత లోతుగా ఉపయోగపడేలా రూపొందించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 30,600 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి కేంద్రంలో 14 మందితో పోలింగ్ కేంద్రాల వారీగా కమిటీలు నియమించాలని, దీంతో నాలుగున్నర లక్షల మంది సుశిక్షితులైన సైన్యం సిద్ధమవుతుందన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక సుశిక్షితుడైన సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌ను నియమించి పార్టీని సాంకేతికంగా, సంస్థాగతంగా పటిష్టం చేయాలని రాజు సూచించారు. ఏఐసీసీ ఎస్‌సీ సెల్ కన్వీనర్ ప్రసాద్ రాష్ట్రంలో ఎల్‌డిఎంఆర్‌సి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఎఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జీ అశోక్ గెల్హట్ సహాయకుడు దీపక్ ఆమెన్ తెలంగాణ కోసం రూపొందించిన సాంకేతిక సమాచారాన్ని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.