తెలంగాణ

ఏది నిజం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 29: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిద్దిపేటకు మంజూరైన మెడికల్ కళాశాల యేడాది కాలంగా సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద చిచ్చుపెట్టి కూర్చుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే ఆ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు కుట్రచేసి సిద్దిపేటకు తరలించుకుపోయారని ప్రభుత్వ మాజీవిప్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కళాశాలను కాపాడుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘోరంగా విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి విమర్శిస్తున్నారు. జగ్గారెడ్డి ఆరోపణలు, విమర్శలను తిప్పకొట్టేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మింగలేక కక్కలేక అన్నట్లుగా నానా అవస్థలు పడుతున్నారు. జగ్గారెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, సంగారెడ్డికి మెడికల్ కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి మంజూరు చేయలేదని, జగ్గారెడ్డి చేసిన దరఖాస్తును పరిశీలించాలని కేవలం సంతకం మాత్రమే చేసారని చింతా ప్రభాకర్ వివరణ ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంగా సంగారెడ్డి కొనసాగుతూ వస్తోంది. అప్పటి సంగారెడ్డి రెవెన్యూ డివిజన్, ఇప్పటి సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా ఎంతో పురోగతి సాధించిన విషయం తెలిసిందే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కు మంజూరైన ఇండియన్ ఇన్‌స్టిటూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీహెచ్)ను సంగారెడ్డికి తీసుకురావడంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశేషంగా కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఐఐటీకి అవసరమైన భూమిని మండల కేంద్రమైన కంది గ్రామ శివారులో కేటాయించడంలో విజయం సాధించారు. విద్యాపరంగా సాధిస్తున్న అభివృద్ధిలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని జగ్గారెడ్డి దరఖాస్తు చేయడం అందుకు సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలించాలని ఆదేశించారని అధికార టీఆర్‌ఎస్ పార్టీ తప్పించుకోలేక అంగీకరిస్తుండటం విశేషం. ముఖ్యమంత్రి సంతకంతో అధికారుల పరిశీలనలో ఉన్న సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు దరఖాస్తును సీఎం, మంత్రి తోసిరాజన్నది వాస్తవమనే తెలుస్తోంది. నిన్నగాక మొన్న యేడాదిన్నర క్రితం కొత్తగా ఏర్పాటైన సిద్దిపేటకు ఉన్నఫలంగా మెడికల్ కళాశాలను మంజూరు చేయడం ఏమిటన్న ప్రశ్నకు టీఆర్‌ఎస్ నుండి సరైన సమాధానం రావడం లేదు.
సిద్దిపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లుగానే సంగారెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసామని, పరిశీలనలో ఉందని, సంగారెడ్డి పర్యటనకు రాగానే సీఎం ద్వారా ప్రకటింపజేస్తామని అధికార పార్టీ నేతలు నేతి బీరకాయ మాటలు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి నాలుగేళ్లు గడిచిపోయినా ముఖ్యమంత్రిని సంగారెడ్డికి తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలయ్యాడని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తుండగా స్వంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం పెదవి విరుస్తున్నారు. పలు సందర్భాల్లో మంత్రి హరీష్‌రావు సైతం సంగారెడ్డికి సీఎంను తీసుకువస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని జగ్గారెడ్డి మూడు రోజులుగా రిలే దీక్షలు చేపట్టగా ఆయా పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. ఈనెల 31న నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. రాజకీయపరంగా ఉనికిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవడం ఎంత వాస్తవమో, సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులకు మెడికల్ కళాశాల అంతే అవసరమన్నది పచ్చి నిజం.