తెలంగాణ

దరఖాస్తు చేసిన అందరికీ సబ్సిడీ రుణాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రుణాలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బీసీ భవన్‌లో బీసీ రుణాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 16 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా సబ్సిడీ రుణాలు అందించలేదని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లు, 11 బీసీ కుల ఫెడరేషన్లకు ఐదువేల కోట్లు కేటాయించామని చెబుతున్నా అందులో కేవలం రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగులు బడ్జెట్‌తో దరఖాస్తు చేసుకున్న 5లక్షల 77వేల మందికి సబ్సిడీ రుణాలు అందించవచ్చునని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం రుణాలను అందించకుండా బీసీ కులాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఇటీవల గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి పేర్కొనడం మరింత విచారకరమని అన్నారు.