తెలంగాణ

సీఎం సొంత గ్రామం నుంచి 250 మంది కాంగ్రెస్‌లో చేరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత గ్రామం చింతమడక నుంచి భారీగా యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నారై గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిద్దిపేట మండలం చింతమడక, రాఘవాపూర్, రావురుకుల ధర్మారం, కాళ్లకుంట కాలనీ, హనుమాన్ నగర్, ఇందిరమ్మ కాలనీ, భరత్‌నగర్‌ల నుంచి రూ.250 మంది యువత కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు సునితా లక్ష్మారెడ్డి, ఇన్‌చార్జ్ పొన్నం ప్రభాకర్‌ల సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 2019లో కాంగ్రెస్ పార్టీనికి అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు. 2019లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడమే లక్ష్యంగా యువత ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. టీ పీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫక్రుద్దీన్, ఎన్నారై సెల్ చైర్మన్ రాహుల్ దూత వినోద్ కుమార్ సిద్దిపేట నాయకులు భూపతి రెడ్డి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగుతున్న వేళ సీఎం సొంత గ్రామం చింతమడకతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతను పార్టీలో చేర్చడంలో కీలక భూమిక పోషించిన వేణుగోపాల్‌ను అభినందించారు.