తెలంగాణ

ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ముఖ్దుంభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు చాడ ముఖ్య అతిధిగా హాజరై కేసీఆర్ నాలుగేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ప్రభుత్వం అన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేరని, సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా చేసే నిరసనలను సైతం అణచివేస్తున్నారని అన్నారు. రైతుల బాధలను పట్టించుకోని ముఖ్యమంత్రి యావత్ రైతాంగాన్ని మోసం చేసే కుట్రలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బతుకులు మారుతాయని అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ కేసీ ఆర్ కుటుంబ పాలనలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.