తెలంగాణ

ఉన్నత విద్యారంగంలో సంచలన మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు, స్కూళ్లలో రాష్ట్ర నాలుగో అవతరణ దినోత్సవ వేడుక పండుగ వాతావరణంలో జరిగింది. ఉన్నత విద్యామండలి , ఇంటర్మీడియట్ బోర్డు ఉస్మానియా యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీ, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీల్లో అధికారికంగా అవతరణ వేడుకల ను నిర్వహించారు. ఉన్నత విద్యామండలిలో చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పతాకావిష్కరణ చేయగా, టిఎఎఫ్‌ఆర్‌సి చైర్మన్ జస్టిస్ పి స్వరూప్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ లింబాద్రి, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావానంతరం విద్యాభివృద్ధికి తీసుకున్న చర్యలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి వివరించారు. ఉన్నత విద్యా రం గంలో సంచలన మార్పులు తీసుకువచ్చామని ఆయ న పేర్కొన్నారు. అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన వారి సేవలను కొనియాడారు. వారికి ప్రశంసాపత్రం, మెమొంటోలను అందించి, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టు టంకశాల అశోక్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారమే తెలంగాణ అభివృద్థి జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటయ్య, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు జరిగాయి. ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షురాలు నీరా కిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీలో ఇచ్చిన హామీని నిలుపుకోలేదని ఆరోపించారు.