తెలంగాణ

అప్పుల తెలంగాణగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ పాలన అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలన మయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వరాష్ట్ర సాధనకు బలిదానాలు చేసిన అమరవీరులకు ఆయన జోహార్లు అర్పించారు. ఈసందర్భంగా లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌పైనా, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ అని మభ్యపెట్టి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొత్తం 4.75 లక్షల కోట్ల రూపాయిల బడ్జెట్ ప్రవేశపెడితే 2 లక్షల కోట్ల అప్పు అయిందని, తెలగాణలో తలసరి అప్పు 70వేలకుచేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల మార్కెట్ స్థిరీకరణకు కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. నాలుగేళ్లుగా వ్యవసాయరంగాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఘనకార్యం చేసినట్టు తెగ ఊదరగొడుతున్నారని అన్నారు. వేలాది మంది రైతులకు ఇంకా వడ్డీ మాఫీ చేయలేదని, ఇంత వరకూ వారి పాస్‌బుక్‌లు బ్యాంకుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ ఎపుడు చేస్తారో చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు.